ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న మంత్రి హరీశ్

ఖమ్మం  జిల్లాలో పర్యటించనున్న మంత్రి హరీశ్

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రులు  హరీశ్ రావు,  పువ్వాడ అజయ్ కుమార్ లు  పర్యటిస్తున్నారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో కార్డియాక్ ఎమర్జెన్సీ అండ్ ట్రామా కేర్ విభాగాన్ని ప్రారంభించారు.  అనంతరం జడ్పీ సమావేశ  మందిరంలో  ఉమ్మడి ఆరోగ్య,  ట్రెజరీ అధికారులతో రివ్యూ మీటింగ్  నిర్వహించనున్నారు. తర్వాత  మధిర మండలం  ఆత్కూరులో ఏర్పాటు  చేసిన  హెల్త్ సబ్ సెంటర్ ప్రారంభించనున్నారు. మధిర ప్రభుత్వ డిగ్రీ  కాలేజి దగ్గర  100 పడకల  హాస్పిటల్ కు శంకుస్థాపన చేయనున్నారు.  అలాగే రేపు  సత్తుపల్లిలోని  ఏరియా ఆసుపత్రి లో 100 పడకల  ఆసుపత్రికి  శంకుస్థాపన చేస్తారు.  సత్తుపల్లి నుంచి  కొత్తగూడం జిల్లాలోని  రామవరం 100 పడకల  ప్రసూతి , శిషు  సంరక్షణ ఆసుపత్రికి శంకుస్థాపన  చేయనున్నట్లు  తెలిపారు. తర్వాత  పాల్వంచ లో కొత్తగా మంజూరైన  నర్సింగ్, మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు పరిశీలించనున్నారు.