
సంగారెడ్డి, వెలుగు: జిల్లా వ్యాప్తంగా రోడ్ల రిపేర్లు, కొత్త రోడ్ల నిర్మాణాలకు ఫండ్స్ ఇచ్చినా.. రోడ్లు ఎందుకు మారడం లేదని మంత్రి హరీశ్‌రావు ఆర్అండ్‌బీ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం జడ్పీ చైర్‌పర్సన్ మంజుశ్రీ అధ్యక్షతన సంగారెడ్డి జడ్పీ మీటింగ్ హాట్‌హాట్‌గా జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో రోడ్ల రిపేర్లు, కొత్త రోడ్లకు ప్రభుత్వం రూ.93కోట్లు రిలీజ్ చేసిందన్నారు. 48 పనులకు సంబంధించి ఒక్కచోట కూడా పనులు స్టార్ట్ కాకపోవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే ప్రపోజల్స్ తయారు చేసి పనులు కాంట్రాక్టర్లకు అప్పగించాలని ఆదేశించారు.
తీరు మారని మీటింగ్
ప్రజా సమస్యలపై చర్చ జరగుతదని ఆశించిన జడ్పీ మీటింగ్ షరామామూలుగానే ముగిసింది. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రజాప్రతినిధులు నిలదీసిన్రు. ఎప్పట్లాగానే ప్రశ్నలు, నిలదీతలతో జడ్పీ మీటింగ్ కొనసాగింది. జడ్పీటీసీలు, ఎంపీపీల ప్రశ్నలకు అందుకు తగ్గట్టే ఆఫీసర్లు చేస్తాంలే అన్నట్లు తలలూపి మీటింగ్అయిపోగానే వెంట తెచ్చుకున్న ఫైల్స్సర్దుకొని వెళ్లిపోయారు. జడ్పీ చైర్‌పర్సన్ మంజుశ్రీ స్పందిస్తూ సభ్యులు అడిగే ప్రశ్నలకు ఆఫీసర్లు సమాధానాలు చెప్పి, పరిష్కార మార్గాలు వెతకాలన్నారు. అనంతరం వ్యవసాయం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్అండ్‌బీ, వైద్య, ఆరోగ్యశాఖ, నీటిపారుదల, మత్స్యశాఖలలో వివిధ అంశాలపై చర్చించారు. ఆయా శాఖల వారీగా నెలకొన్న సమస్యలను జడ్పీటీసీ, ఎంపీపీలు ప్రస్తావిస్తూ అధికారులను నిలదీశారు. మీటింగ్‌కు ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, మాణిక్ రావు, క్రాంతి కిరణ్, జగ్గారెడ్డి, రాష్ట్ర చేనేత సహకార సంస్థ చైర్మన్ చింత ప్రభాకర్, కలెక్టర్ శరత్, అడిషనల్ కలెక్టర్లు వీరారెడ్డి, రాజార్షి షాతోపాటు వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు.
మా వాటా మాకివ్వండి.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి
వివిధ అభివృద్ధి పనులకు సంగారెడ్డి నియోజకవర్గానికి రావలసిన ఫండ్స్ వెంటనే ఇవ్వాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. ఈ మేరకు జడ్పీ మీటింగ్ కు హాజరైన ఆయన డెవలప్మెంట్విషయంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న తన నియోజకవర్గానికి రావాల్సిన వాటా మంజూరు చేయించి అభివృద్ధికి సహకరించాలని మంత్రి హరీశ్‌రావుకు విజ్ఞప్తి చేశారు. స్పందించిన మంత్రి డెవలప్‌మెంట్ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు అంటూ ఫండ్స్ శాంక్షన్ చేయిస్తామని హామీ ఇచ్చారు. సదాశివపేట, కొండాపూర్ (అలియాబాద్)లలో ఇదివరకు 10 వేల మంది పేదలకు ఇచ్చిన ఇండ్ల స్థలాలను రెగ్యులరైజ్మంత్రికి జగ్గారెడ్డి వినతి పత్రం ఇచ్చారు.
చెరువుల కబ్జాపై నిలదీత
పటాన్‌చెరు నియోజకవర్గంలోని పటాన్‌చెరువు, అమీన్పూర్మండలాల్లో చెరువులు కబ్జా అవుతుంటే ఏం చేస్తున్నారని జడ్పీ వైస్ చైర్మన్ కుంచల ప్రభాకర్ ఇరిగేషన్ అధికారులను ప్రశ్నించారు. ఆఫీసర్లు రియల్టర్లకు కొమ్ముకాస్తున్నారని ప్రభావర్ఆరోపించారు. ఇరిగేషన్ఆఫీసర్లు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. జడ్పీ చైర్‌పర్సన్ కలగజేసుకొని ఈ సమస్య జిల్లా వ్యాప్తంగా ఉందని, కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోకుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. జిల్లాలోని నాగల్ గిద్ద, హత్నూర, వట్ పల్లి మండలాల్లో విద్యావ్యవస్థ పూర్తిగా కుంటుపడిపోయిందని సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు. గవర్నమెంట్ స్కూళ్ల నిర్వహణ అధ్వానంగా తయారైందని, అక్కడి విద్యాధికారులు, హెచ్ఎంలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. స్పందించిన డీఈవో రాజేశ్.. విచారణ జరిపి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.