తెలంగాణ ఉద్యమానికి కొమురయ్యనే స్ఫూర్తి: హరీష్ రావు

తెలంగాణ ఉద్యమానికి కొమురయ్యనే స్ఫూర్తి: హరీష్ రావు

తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ ఉద్యమానికి కొమురయ్యనే స్ఫూర్తిగా తీసుకున్నామని చెప్పారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం మామిడిపల్లిలో కురుమ సంఘం భవన నిర్మాణానికి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో ఏర్పాటు చేసిన దొడ్డి కొమురయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. వచ్చే రెండు నెలల్లో హైదరాబాద్ లో కరుమ జాతి ఆత్మగౌరవ భవనం పూర్తి కానుందని ఆయన చెప్పారు. కురుమలకు కొమురవెల్లి మల్లన్న ఆలయ ఛైర్మన్ పదవి ఇచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. 

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని బీసీ సంక్షేమ శాఖ కావాలని అడిగామని.. కాని ఇప్పటివరకూ అతిగతి లేదని హరీష్ ఆరోపించారు. వాళ్లకి ఎప్పుడూ అంబానీ, ఆదానినే కావాలని విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్లినా కేసీఆర్ గురించి గొప్పగా చెబుతారని హరీష్ తెలిపారు. ఇక ఉగాది, శ్రీరామనవమి తరువాత రెండో విడత గొర్రెల పంపిణీ చేస్తామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.