కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది

కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కోఠిలోని టీఎస్ఎంఐడీసీ కార్యాలయంలో వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా కేసుల సంఖ్య పెరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.  ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పకుండా ధరించాలని అన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. కరోనా లక్షణాలుంటే వెంటనే టెస్ట్ లు చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. పీహెచ్సీ నుండి బోధనాస్పత్రుల వరకు అప్రమత్రంగా ఉండాలని సూచించారు. 

మరిన్ని వార్తల కోసం... 

PPE కిట్ల కాంట్రాక్టులో అస్సాం సీఎం భారీగా అక్రమాలు