కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం : హరీష్​ రావు

కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం : హరీష్​ రావు

దేశంలోని అన్ని సర్వేల్లోనూ కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అవుతారని చెబుతున్నాయని మంత్రి హరీష్ రావు చెప్పారు. అత్యధిక స్థానాల్లో గెలిచి మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటవుతుందన్నారు. 2024, జనవరి నుంచి అన్ని రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో తెలంగాణ ద్రోహులంతా ఒక్కటవుతున్నారని ఆరోపించారు. పవన్ కల్యాణ్ తో బీజేపీ జోడీ కట్టిందన్నారు. తెలంగాణ వచ్చిన కొత్తలో తనకు బాధతో ఆకలేస్తలేదని పవన్ కల్యాణ్ చెప్పాడని అన్నారు.

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో మంత్రి హరీష్ రావు పర్యటించారు. జహీరాబాద్ లో నిర్వహించిన బీఆర్ఎస్ ఎన్నికల బూత్ స్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అసైన్డ్ భూములపై రైతులకు పూర్తి హక్కులు కల్పిస్తామని మంత్రి హరీష్​ రావు హామీ ఇచ్చారు. స్థలం లేని పేదలకు ఇంటి స్థలాలు ఇస్తామన్నారు. వికారాబాద్ లో గెలవని కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్ జహీరాబాద్ లో ఎలా గెలుస్తాడని ప్రశ్నించారు. జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్ రోజుకో పార్టీ మారుతాడని సెటైర్ వేశారు. జహీరాబాద్ లో అభ్యర్థి మాణిక్ రావు గెలుపును ఎవరూ ఆపలేరని అన్నారు.