అభివృద్ది చేశానని చెప్పుకునే పరిస్థితి ఈటలకు లేదు

అభివృద్ది చేశానని చెప్పుకునే పరిస్థితి ఈటలకు లేదు

టీఆర్ఎస్ పార్టీకి రోజు రోజుకీ హుజురాబాద్ లో ఆదరణ పెరుగుతోందన్నారు మంత్రి హరీశ్ రావు. ఈటల రాజేందర్  మోసానికి, గెల్లు శ్రీనివాస్ విశ్వసనీయతకు మధ్యలో ఈ పోటీ జరుగుతోందన్నారు.హుజురాబాద్ పట్టణ టీఆర్ఎస్ ఆఫీసులో.. తెలుగు దేశం పార్టీకి చెందిన పలువురు హరీశ్ రావు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. హుజురాబాద్ లో అభివృద్ది చేశానని చెప్పుకునే పరిస్థితి ఈటలకు లేదన్నారు. అందుకే సెంటిమెంట్ ను రగిలిస్తున్నాడని అరోపించారు. ఈటలకు  ఏం చెప్పాలో అర్థం కాక అబద్ధాలు మాట్లాడి ఓట్లు సంపాధించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అభివృద్ది కావాలంటే గెల్లు శ్రీనివాస్ ను గెలిపించాలని కోరారు. ఐదు నెలల కింద బీజేపీని విమర్శించిన ఈటల..ఇప్పుడు అదే పార్టీలో చేరాడన్నారు. మేము హుజురాబాద్ వచ్చి అభివృద్ది చేస్తుంటే..కేంద్ర మంత్రులు వచ్చి ఖాళీ చేతులు చూపించి వెళ్తున్నారని విమర్శించారు.

గెల్లు శ్రీనివాస్ గెలిచిన తర్వాత హుజురాబాద్ కు వచ్చి ఇచ్చిన హామీలు పూర్తయ్యే విధంగా పని చేస్తామన్నారు మంత్రి హరీశ్ . ఈటల రాజేందర్ మాట్లాడే మాటల్లో నీతి నిజాయితీ ఉందా?  హుజురాబాద్ ప్రజలు అలోచించాలన్నారు.