ఈటలను గెలిపిస్తే గ్యాస్ ధర రూ.1500 చేస్తరు

ఈటలను గెలిపిస్తే గ్యాస్ ధర రూ.1500 చేస్తరు

కరీంనగర్: హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ నేత ఈటల రాజేందర్ ను గెలిపిస్తే.. గ్యాస్ ధరను అమాంతం రూ. 1500 చేస్తారని ఆర్థికమంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. మండలంలోని ధర్మరాజు పల్లిలో జరిగిన టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

‘హుజురాబాద్‎లో ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది? హుజురాబాద్‎కు జిల్లా కావాలని ఈటల రాజీనామా చేశాడా? మెడికల్ కాలేజీ కావాలని కోసం చేశాడా? దేని కోసం రాజీనామా చేశాడు? ఆయన తన స్వలాభం కోసమే రాజీనామా చేశాడు. ఒక వ్యక్తి లాభం కావాలా? హుజురాబాద్ వ్యవస్థ బాగుపడాలా అన్నది మీరు ఓ సారి ఆలోచించండి. బీజేపీలో ఈటల ఎందుకు చేరాడో చెప్పాలి? ఈ ప్రజలకు బీజేపీ ప్రభుత్వం ఏం మేలు చేసింది? నిన్న మహిళలు బతుకమ్మలతో పాటు సిలిండర్లు పెట్టి పాటలు పాడారు. పెంచిన గ్యాస్ ధరను నిరసిస్తూ బతుకమ్మ ఆడారు. నిన్న కూడా మరో 15 రూపాయలు గ్యాస్ ధర పెంచారు. మీరు బీజేపీని గెలిపిస్తే ఆ ధర 1500 చేస్తారు. ప్రజలకు ధరలు పెరిగినా ఫర్వాలేదు.. ఆయన మాత్రం బాగుండాలని ఈటల అనుకుంటున్నారు. రాష్ట్రంలోనే మొదటి రైతుబంధు చెక్కు.. ధర్మారాజు పల్లి గ్రామానికి చెందిన సంజీవ రెడ్డికి వచ్చింది. ఇప్పుడు ఏదిచ్చినా నా వల్లే వచ్చాయని చెప్పుకుంటున్న ఈటల.. ఆనాడు ఎందుకు రైతుబంధు ఇచ్చారో చెప్పాలి. నీ చేతగాని తనంవల్లే, నీవు చేయకపోవడం వల్లే.. ఇప్పుడు హుజురాబాద్‎లో మేం ఇస్తున్నాం, చేస్తున్నాం. కరోనా సమయంలోనూ రూ. 7500 కోట్ల రైతుబంధును కేసీఆర్ విడుదల చేశారు. ఉద్యోగులకు, మంత్రులకు జీతాలు ఆపినా.. రైతుబంధు, ఆసరా వంటివి ఆపకుండా ఇచ్చారు. బీజేపీ డీజిల్ ధర పెంచడం వల్ల ట్రాక్టర్ కూలీ రేటు ఏడాదికే 2 వేలు పెరిగింది. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న టీఆర్ఎస్‎కు అండగా ఉండాలి’ అని హరీష్ రావు అన్నారు.

For More News..

నామినేషన్ వేసేందుకు క్యూ కట్టిన ఫీల్డ్ అసిస్టెంట్లు

అర్జున్ రెడ్డి డైరెక్టర్‎తో డార్లింగ్ ప్రభాస్ సినిమా

చరిత్ర లిఖించే విధంగా హుజురాబాద్ ఫలితాలుంటాయి