నామినేషన్ వేసేందుకు క్యూ కట్టిన ఫీల్డ్ అసిస్టెంట్లు

నామినేషన్ వేసేందుకు క్యూ కట్టిన ఫీల్డ్ అసిస్టెంట్లు

కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నికను అన్ని పార్టీలు సీరియస్‎గా తీసుకున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపు కోసం నువ్వా నేనా అన్నట్లు తీవ్రంగా ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ తరపున గెల్లు శ్రీనివాస్ నామినేషన్ వేయగా.. బీజేపీ తరపున ఈటల రాజేందర్ శుక్రవారం నామినేషన్ వేయనున్నారు. ఈ క్రమంలోనే హుజురాబాద్‎లో ఇండిపెండెంట్ అభ్యర్థుల నామినేషన్లు కూడా ఎక్కువయ్యాయి. గురువారం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు దాదాపు 50 మంది ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు ఆర్డీవో కార్యాలయానికి వచ్చారు. 

అయితే దాదాపు నాలుగు రోజులుగా నామినేషన్ వేసేందుకు ప్రయత్నిస్తుంటే.. అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ఫీల్డ్ అసిస్టెంట్లు నిన్న, మొన్న ఆందోళన చేశారు. 

ఈ రోజు ఎలాగైనా నామినేషన్ వేయాలని ఆర్డీవో ఆఫీస్ వద్ద క్యూ కట్టారు.
For More News..

హైదరాబాద్‌లో సెంచరీ దాటిన డీజిల్ ధర

అర్జున్ రెడ్డి డైరెక్టర్‎తో డార్లింగ్ ప్రభాస్ సినిమా

చరిత్ర లిఖించే విధంగా హుజురాబాద్ ఫలితాలుంటాయి