వైద్యరంగంలోని ఖాళీ పోస్టులను భర్తీ చేస్తం: హరీష్ రావు

వైద్యరంగంలోని ఖాళీ పోస్టులను భర్తీ చేస్తం: హరీష్ రావు

సీఎం కేసీఆర్ ఏ కార్యక్రమం చేసినా.. ప్రజల కోసం ఆలోచించి వారికి ఉపయోగపడేలా చేస్తారని మంత్రి హరీష్ రావు అన్నారు. రెండో విడత కంటి వెలుగు పథకం పై వైద్యాధికారులతో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జనవరి 18న రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు ప్రారంభం కానుందని ఆయన చెప్పారు. దీనికి సంబంధించి రూ.200 కోట్ల మంజూరికి జీవో ఇచ్చామని తెలిపారు. మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని 8 నెలల పాటు నిర్వహించామన్నారు. ఇప్పుడు రెండో విడత 5 నెలల పాటు చేస్తామన్నారు. మొత్తం 100 వర్కింగ్ రోజుల్లో కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని హరీష్ రావు అన్నారు. 

మొదటి విడతలో కంటి వెలుగు కార్యక్రమం కోసం 827 టీమ్స్‭ పనిచేశాయని హరీష్ రావు తెలిపారు. ఈ ఏడాది రెండో విడత కోసం 1500 టీమ్స్‭ను ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్రంలో వైద్యరంగంలో ఉన్న  ఖాళీలను పూర్తి చేస్తున్నామని తెలిపారు.  వైద్యులు, ఎక్విప్మెంట్‭లను కూడా పెంచుతున్నామని అన్నారు. 969 పోస్టుల మెరిట్ లిస్ట్  మరో రెండు రోజుల్లో రిలీజవుతోందని చెప్పారు. రెగ్యులర్ పబ్లిక్ హెల్త్ కార్యక్రమాలతో పాటు కంటి వెలుగు చేస్తామని హరీష్ రావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కలెక్టర్ ఇన్వాల్వ్ అవుతారని ఆయన చెప్పారు. ఇక జనవరి 5న కలెక్టర్, ప్రజాప్రతినిధులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.