శ్రీవారికి సాలగ్రామ హారం సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్

శ్రీవారికి సాలగ్రామ హారం సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్

తిరుపతి: తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తిరుమల శ్రీవారిని సోమవారం దర్శించుకున్నారు. ఇవాళ ఉదయంమే వి.ఐ.పి‌ విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.  అనంతరం రంగనాయకుల మండపంలో శ్రీవారికి వెండి సాలిగ్రామ హారాన్ని కుటుంబ సభ్యులతో కలిసి విరాళంగా సమర్పించారు. హారాన్ని టిటిడి దేవస్థానం అదనపు ఈవో ఏవి.ధర్మారెడ్డికి అందజేశారు. 

కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్న తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబ సభ్యులకు వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేసారు.

అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన మంత్రి మీడియాతో మాట్లాడుతూ..స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా వుందని, కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడాలని, రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని ప్రార్ధించినట్లు తెలియజేసారు. తెలంగాణాలో‌ ప్రస్తుతం అంతా బాగానే ఉందని, హుజురాబాద్ ఉప ఎన్నికలు జరపాలని నోటిఫికేషన్ వస్తే.. టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.