యాసంగిలో వడ్ల కొనుగోలు సెంటర్లుండవు

యాసంగిలో వడ్ల కొనుగోలు సెంటర్లుండవు
  • మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్, వెలుగు: యాసంగిలో ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయదని, రైతులు వరికి బదులు ఇతర పంటలు వేసుకోవాలని మంత్రి ఇంద్రకరణ్‍రెడ్డి సూచించారు. బుధవారం ఆయన ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మీడియా సమావేశంలో  మాట్లాడారు. బాయిల్డ్​రైస్​ను కొనబోయేదిలేదని కేంద్ర ప్రభుత్వం చెప్పినందున వరి పండించవద్దని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీపై ప్రజల్లో విశ్వాసం తగ్గుతోందని, త్వరలో ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాల్లో ఓడిపోతామన్న  భయంతోనే సాగు చట్టాలను రద్దు చేశారన్నారు.  సాగు చ‌‌ట్టాల ర‌‌ద్దుపై పార్లమెంట్​లో చ‌‌ర్చ జ‌‌ర‌‌పాల‌‌ని విప‌‌క్షాలు డిమాండ్ చేసినా పట్టించుకోకుండా ఒక్క  నిమిషంలోనే రద్దు చేశారన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్​ నేతలు రాంకిషన్‍రెడ్డి, వెంకట్రామిరెడ్డి, రామేశ్వర్ రెడ్డి, రాజేందర్, రాము పాల్గొన్నారు.