ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

నల్గొండ, వెలుగు : సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ జాతీయ రాజకీయాల్లోకి రావాలన్నది ప్రజల కోరిక అని విద్యుత్‌‌‌‌‌‌‌‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి, జడ్పీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ బండా నరేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డితో కలిసి శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అభివృద్ధిలో ముందుకు పోతున్న తెలంగాణను కేంద్ర ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. కాంగ్రెస్ చుక్కాని లేని నావలా మారిందన్నారు. దేశాన్ని అభివృద్ధి చేసేందుకే కేసీఆర్​ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు అంతా సిద్ధంగా ఉన్నామన్నారు. నల్గొండ జిల్లా ప్రజల పోరాటాలు మరువలేనివన్నారు. సమావేశంలో నాయకులు కటికం సత్తయ్యగౌడ్‌‌‌‌‌‌‌‌, నల్గొండ మున్సిపల్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ మందడి సైదిరెడ్డి, అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌ కమిటీ చైర్మన బొర్ర సుధాకర్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

శిలాఫలకంపై నా పేరు ఏది ?

యాదాద్రి, వెలుగు : ‘రైతు వేదిక ఓపెన్‌‌‌‌‌‌‌‌ చేస్తున్న విషయాన్ని నాకు ఎందుకు చెప్పలేదు.. శిలాఫలకంపై నా పేరు ఎందుకు రాయలేదు.. బీసీలంటే అంత చులకనగా ఉందా’ అంటూ రైతు బంధు యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కొలుపులు అమరేందర్‌‌‌‌‌‌‌‌ అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లను నిలదీశారు. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం బొల్లేపల్లిలో నిర్మించిన రైతువేదికను శుక్రవారం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌‌‌‌‌‌‌‌రెడ్డి ప్రారంభించారు. వేరే పనిపై అక్కడికి వచ్చిన కొలుపుల అమరేందర్‌‌‌‌‌‌‌‌ రైతు వేదిక ప్రారంభ విషయాన్ని తనకు ఎందుకు చెప్పలేదని, శిలాఫలకంపై తన పేరు ఎందుకు రాయలేదని ఏవో వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డిని ప్రశ్నించారు. రైతులకు సంబంధించిన ప్రతి పనికి రైతుబంధు ప్రతినిధులను ఆహ్వానించాలని సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ చెప్పినా పట్టించుకోరా ? బీసీలు కాబట్టే పిలవడం లేదా ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్‌‌‌‌‌‌‌‌ ఆదేశాల మేరకే పేర్లు రాయించామని ఏవో సమాధానం ఇచ్చారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుండడంతో ఎమ్మెల్యే జోక్యం చేసుకొని వారికి సర్ది చెప్పారు. మరోసారి రిపీట్‌‌‌‌‌‌‌‌ కాకుండా చూసుకోవాలని ఏవోకు సూచించారు.

నిర్వాసితులకు ఆర్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ ప్యాకేజీ ఇవ్వాలి

చండూరు (మర్రిగూడ), వెలుగు : చర్లగూడెం నిర్వాసితులకు ఆర్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ ప్యాకేజీ, పునరావాసం కల్పించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. నల్గొండ జిల్లా మర్రిగూడ తహసీల్దార్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ ఎదుట నిరసన దీక్ష చేస్తున్న నిర్వాసితులను గురువారం వారు వేర్వేరుగా కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శంకుస్థాపన టైంలో సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. మల్లన్న సాగర్‌‌‌‌‌‌‌‌ నిర్వాసితులకు ఇచ్చినట్లుగానే ఇక్కడి నిర్వాసితులకు కూడా పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ను రెండున్నరేళ్లలో పూర్తి చేస్తానని చెప్పి ఏడేళ్లు దాటినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 

‘బీసీ’ సభను సక్సెస్‌‌‌‌‌‌‌‌ చేయాలి

మునుగోడు, వెలుగు : నల్గొండ జిల్లా మునుగోడులో ఈ నెల 11న నిర్వహించే బీసీల ఆత్మీయ అభినందన సభను సక్సెస్‌‌‌‌‌‌‌‌ చేయాలని బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనకాల శ్యాం, ఉపాధ్యక్షుడు పానుగంటి విజయ్‌‌‌‌‌‌‌‌ పిలుపునిచ్చారు. సభ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను శుక్రవారం మునుగోడులో ఆవిష్కరించి మాట్లాడారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన జాజుల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌ను సన్మానించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గుంటోజు వెంకటాచారి, రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి కృష్ణ, సర్పంచ్‌‌‌‌‌‌‌‌ల ఫోరం రాష్ర్ట కార్యదర్శి గుర్రం సత్యం, జేఏసీ జిల్లా చైర్మన్‌‌‌‌‌‌‌‌ డాక్టర్‌‌‌‌‌‌‌‌ తోట నర్సింహాచారి, సర్పంచ్‌‌‌‌‌‌‌‌ల ఫోరం నియోజకవర్గ అధ్యక్షుడు మిర్యాల వెంకటేశం, బీసీ సంఘం జిల్లా కార్యదర్శి ఈదుల కంటి కైలాసం పాల్గొన్నారు.

నారసింహుడిని దర్శించుకున్న ప్రముఖులు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. హైకోర్టు జడ్జీలు జె.శ్రీనివాసరావు, సీవీ.భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, ఐపీఎస్ వందన శుక్రవారం గుట్టకు వచ్చారు. వారికి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అద్దాల మండపం వద్ద అర్చకులు వేదాశీర్వచనం చేయగా ఆలయ సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఊడెపు రాజు ప్రసాదం, శేషవస్త్రాలు అందజేశారు. మరో వైపు ఆలయంలో నిత్యపూజలు ఘనంగా జరిగాయి. పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా శుక్రవారం ఆలయానికి రూ.13,72,710 ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కం వచ్చినట్లు ఆఫీసర్లు తెలిపారు.

లారీ ఢీకొని 18 గొర్రెలు మృతి

హాలియా, వెలుగు : లారీ ఢీకొని 18 గొర్రెలు చనిపోయిన ఘటన నల్గొండ జిల్లా త్రిపురారంలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం త్రిపురారానికి చెందిన చింతకాయల అంజయ్య, సింగం లింగయ్య తమ గొర్రెలను రోడ్డు దాటిస్తున్నారు. ఈ క్రమంలో మిర్యాలగూడ నుంచి దేవరకొండ వైపు వెళ్తున్న లారీ ఢీ కొట్టడంతో 18 గొర్రెలు చనిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు లారీని వెంబడించి పట్టుకొని స్టేషన్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. బాధితుడు అంజయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై జి. శోభన్‌‌‌‌‌‌‌‌బాబు తెలిపారు.

ఆలయాల్లో చోరీలు చేస్తున్న ఇద్దరు అరెస్ట్‌‌‌‌‌‌‌‌

మిర్యాలగూడ, వెలుగు : ఆలయాలే టార్గెట్‌‌‌‌‌‌‌‌గా చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను శుక్రవారం మిర్యాలగూడ వన్‌‌‌‌‌‌‌‌టౌన్‌‌‌‌‌‌‌‌ పోలీసులు పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ వై.వెంకటేశ్వర్‌‌‌‌‌‌‌‌రావు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... ఏపీలోని వెస్ట్‌‌‌‌‌‌‌‌ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గొల్లలకోడేరు గ్రామానికి చెందిన కాళ్లకూరి కిరణ్‌‌‌‌‌‌‌‌బాబు, వుండి మండల కేంద్రానికి చెందిన చొక్కాకుల సజ్జన్‌‌‌‌‌‌‌‌రావు కలిసి ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. 2020లో అరెస్టై జైలుకు వెళ్లి డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో విడుదల అయ్యారు. తర్వాత కొంతకాలం పాటు వేరే సంస్థలో పనిచేసిన వీరు మళ్లీ చోరీల బాట పట్టారు. అప్పటి నుంచి నల్గొండ, మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, ఖమ్మం జిల్లాల పరిధిలోని పలు ఆలయాల్లో చోరీ చేశారు. ఉదయం రెక్కీ నిర్వహించి రాత్రుళ్లు చోరీలకు పాల్పడేవారు. ఈ క్రమంలో శుక్రవారం మిర్యాలగూడ వన్‌‌‌‌‌‌‌‌టౌన్‌‌‌‌‌‌‌‌ పోలీసులు చింతపల్లి క్రాస్‌‌‌‌‌‌‌‌రోడ్డు వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ టైంలో అటుగా వచ్చిన వచ్చిన కారును ఆపి తనిఖీ చేయడంతో ఇనుప రాడ్‌‌‌‌‌‌‌‌, స్క్రూ డ్రైవర్, ఆభరణాల కట్టర్‌‌‌‌‌‌‌‌, మెల్టింగ్‌‌‌‌‌‌‌‌ మిషన్‌‌‌‌‌‌‌‌ వంటివి కనిపించడంతో కారులో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా చోరీల విషయం బయటపడింది. ఇద్దరిని అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేయడంతో పాటు రూ. 30 లక్షల విలువైన 45 కేజీల వెండి, 60 గ్రాముల బంగారు ఆభరణాలు, స్విఫ్ట్‌‌‌‌‌‌‌‌ డిజైర్‌‌‌‌‌‌‌‌ కారు, రెండు సెల్‌‌‌‌‌‌‌‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో వన్‌‌‌‌‌‌‌‌టౌన్‌‌‌‌‌‌‌‌ సీఐ రాఘవేందర్, క్రైం టీం ఎస్సై సుధీర్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, హెడ్‌‌‌‌‌‌‌‌ కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌ పి.వెంకటేశ్వర్లు, ఆర్. శ్రీనివాస్, పి. నాగరాజు, కొమ్ము రవి, ఎస్. వెంకటేశ్వర్లు, ఎం. రామకృష్ణ ఉన్నారు.

రైతులకు పరిహారం చెల్లించాలి

హాలియా, వెలుగు : సాగర్‌‌‌‌‌‌‌‌ కాల్వకు గండి పడడంతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. గండి పడిన ప్రదేశాన్ని, నిడమనూరు వద్ద కోతకు గురైన రోడ్డును శుక్రవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. కాల్వకు గతంలో చేపట్టిన పనులు నాసిరకంగా ఉండడం వల్లే గండి పడిందని, దీని వల్ల పంట కొట్టుకుపోగా, పొలాల్లో ఇసుక మేటలు వేసిందన్నారు. నష్టాన్ని అంచనా వేసి ఎకరానికి రూ.లక్ష తగ్గకుండా పరిహారం చెల్లించాలని కోరారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కున్‌‌‌‌‌‌‌‌రెడ్డి నాగిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, నాయకులు కొండేటి శ్రీను, అవుతా సైదులు, కత్తి లింగారెడ్డి రామ్మూర్తి, కందుకూరి కోటేశ్‌‌‌‌‌‌‌‌, ఆకారపు నరేశ్‌‌‌‌‌‌‌‌, పాతని శ్రీను, నల్లబోతు సోమయ్య పాల్గొన్నారు.

హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ అభివృద్ధే ఎజెండా

మేళ్లచెరువు (హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌), వెలుగు : హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ఎజెండా అని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చెప్పారు. నియోజకవర్గ పరిధిలోని పలువురికి మంజూరైన సీఎంఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌ చెక్కులను శుక్రవారం పంపిణీ చేసి మాట్లాడారు. ప్రతిపక్ష నాయకులు ఎన్ని విమర్శలు చేసినా నియోజకవర్గ అభివృద్ధే ఎజెండాగా పనిచేస్తామన్నారు. సీఎంఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌ కోసం నకిలీ బిల్లులు సబ్మిట్‌‌‌‌‌‌‌‌ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మున్సిపాలిటీని డెవలప్‌‌‌‌‌‌‌‌ చేస్తుంటే కొందరు వ్యక్తులు కావాలనే కోర్టు కేసుల ద్వారా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అనంతరం మేళ్లచెరువులో ఆసరా లబ్ధిదారులకు కార్డులను అందజేశారు.

కొనసాగుతున్న నీటి విడుదల

హాలియా, వెలుగు : శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌కు ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌కు ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లో కొనసాగుతోంది. 3,93,753 క్యూసెక్కుల వరద వస్తుండడంతో సాగర్‌‌‌‌‌‌‌‌ 18 గేట్లను 10 ఫీట్లు, 4 గేట్లను 15 ఫీట్ల మేర ఎత్తి 3,48,956 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌‌‌‌‌‌‌‌లో ప్రస్తుతం 588.20 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. కుడికాల్వకు 9,833 క్యూసెక్కులు, ఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌బీసీకి 1,800, మెయిన్‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌హౌజ్‌‌‌‌‌‌‌‌కు 32,764 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. 

పులిచింతల 16 గేట్లు ఓపెన్‌‌‌‌‌‌‌‌

మేళ్లచెరువు (చింతలపాలెం), వెలుగు : సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పులిచింతల ప్రాజక్టుకు వరద భారీగా వస్తోంది. 3.61 లక్షల క్యూసెక్కుల ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లో వస్తుండడంతో 16 గేట్లను ఎత్తి 4.23 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ పూర్తి స్థాయి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 37.3 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

చదువుతో పాటు ఆటలపై దృష్టి పెట్టాలి

యాదాద్రి, వెలుగు : స్టూడెంట్లు చదువుతో పాటు ఆటలపైనా ఫోకస్‌‌‌‌‌‌‌‌ చేయాలని యాదాద్రి కలెక్టర్‌‌‌‌‌‌‌‌ పమేలా సత్పతి సూచించారు. ఇటీవల కేరళలో నిర్వహించిన ఖేలో ఇండియా ఉమెన్స్‌‌‌‌‌‌‌‌ పోటీల్లో ప్రతిభ చూపిన శ్రీనిజ, సుష్మ, వెన్నెల, శ్రావణి, వైష్ణవికి శుక్రవారం ఆమె ప్రతిభా పురస్కారం అందజేశారు. జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ చూపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ డి.శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి, యువజన మరియు క్రీడల ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ ధనాంజనేయులు ఉన్నారు.

నిర్వాసితులకు ఆర్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ ప్యాకేజీ ఇవ్వాలి

చండూరు (మర్రిగూడ), వెలుగు : చర్లగూడెం నిర్వాసితులకు ఆర్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ ప్యాకేజీ, పునరావాసం కల్పించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. నల్గొండ జిల్లా మర్రిగూడ తహసీల్దార్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ ఎదుట నిరసన దీక్ష చేస్తున్న నిర్వాసితులను గురువారం వారు వేర్వేరుగా కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శంకుస్థాపన టైంలో సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. మల్లన్న సాగర్‌‌‌‌‌‌‌‌ నిర్వాసితులకు ఇచ్చినట్లుగానే ఇక్కడి నిర్వాసితులకు కూడా పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ను రెండున్నరేళ్లలో పూర్తి చేస్తానని చెప్పి ఏడేళ్లు దాటినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 

డబుల్‌‌‌‌‌‌‌‌ ఇండ్లను త్వరగా పంపిణీ చేయాలి

మునగాల (మోతె), వెలుగు : అర్హులైన వారికి రాజకీయ జోక్యం లేకుండా డబుల్‌‌‌‌‌‌‌‌ ఇండ్లు పంపిణీ చేయాలని సీపీఎం సూర్యాపేట జిల్లా కమిటీ సభ్యుడు మట్టిపెళ్లి సైదులు డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. లేకపోతే సీపీఎం ఆధ్వర్యంలో పేదలకు ఇండ్లు పంచుతామని ప్రకటించారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం రావిపహాడ్‌‌‌‌‌‌‌‌, అప్పన్నగూడెంలో నిర్మించిన డబుల్‌‌‌‌‌‌‌‌ ఇండ్లను శుక్రవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఇండ్లు నిర్మించి ఐదేళ్లు గడుస్తున్నా లబ్ధిదారులను గుర్తించి ఇండ్లు కేటాయించడంలో ఆఫీసర్లు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఈ నెల 22లోగా ఇండ్లను పంపిణీ చేయకపోతే 23న సీపీఎం ఆధ్వర్యంలో సామూహిక గృహప్రవేశాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు కాంపాటి శ్రీను, సోమగాని మల్లయ్య, శాఖ కార్యదర్శి కుంచం గోపయ్య, డీవైఎఫ్ఐ మండల కార్యదర్శి వెలుగు మధు పాల్గొన్నారు.

విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

మునగాల, వెలుగు : విద్యార్థుల సంక్షేమం కోసమే ప్రభుత్వం ‘స్వచ్ఛ గురుకుల్‌‌‌‌‌‌‌‌’ పేరుతో అభివృద్ధి పనులు చేపట్టిందని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాములలో గిరిజన డిగ్రీ కాలేజీలో శుక్రవారం ఆయన మొక్కలు నాటి మాట్లాడారు. పేదలకు మంచి ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌ అందించాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం గురుకుల స్కూళ్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భోజనం విషయంలో సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌‌‌‌‌‌‌‌ శ్రీలత, కోదాడ ఎంపీపీ చింత కవిత రాధారెడ్డి, మార్కెట్‌‌‌‌‌‌‌‌ కమిటీ మాజీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ పైడిమర్రి సత్యబాబు, కౌన్సిలర్‌‌‌‌‌‌‌‌ పద్మజ, గ్రంథాలయ చైర్మన్‌‌‌‌‌‌‌‌ రహీం పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల నిర్వహణపై క్యాంప్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో రివ్యూ చేశారు. 

జాతీయ సమైక్యత వేడుకలను సక్సెస్‌‌‌‌‌‌‌‌ చేయాలి

మిర్యాలగూడ, వెలుగు : ఈ నెల 16 నుంచి 18 వరకు నిర్వహించే తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాలను సక్సెస్‌‌‌‌‌‌‌‌ చేయాలని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌‌‌‌‌‌‌‌రావు పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వేడుకల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు.  మున్సిపల్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ తిరునగరు భార్గవ్‌‌‌‌‌‌‌‌, డీసీఎంఎస వైస్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ దుర్గంపూడి నారాయణరెడ్డి, ఎంపీపీలు నూకల సరళహనుమంతరెడ్డి, నందిని రవితేజ, ఆర్డీవో బి. రోహిత్‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌, డీఎస్పీ వై.వెంకటేశ్వర్‌‌‌‌‌‌‌‌రావు పాల్గొన్నారు.

వేడుకలను ఘనంగా నిర్వహించాలి

నల్గొండ అర్బన్, వెలుగు : తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని నల్గొండ ఆర్డీవో జగన్నాథరావు ఆదేశించారు. డీఈవో భిక్షపతి, డీపీఆర్‌‌‌‌‌‌‌‌వో శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌తో పాటు ఎంపీడీవోలు, తహసీల్దార్లతో శుక్రవారం నిర్వహించిన మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడారు. 16న పట్టణంలోని లక్ష్మి గార్డెన్‌‌‌‌‌‌‌‌ నుంచి ఎన్‌‌‌‌‌‌‌‌జీ కాలేజీ వరకు ర్యాలీ నిర్వహిస్తామని, అనంతరం కాలేజీలో మీటింగ్‌‌‌‌‌‌‌‌ నిర్వహించనున్నట్లు చెప్పారు. 17న జాతీయ జెండా ఆవిష్కరణ, 18న సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, స్వాతంత్ర్య సమరయోధులు, కళాకారులకు సన్మానం నిర్వహించనున్నట్లు చెప్పారు. 

వినాయకా.. సెలవిక..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని డాక్టర్స్‌‌‌‌‌‌‌‌ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద శుక్రవారం లడ్డూ వేలం నిర్వహించారు. రూ. 1.17 లక్షలకు రిజా అంబులెన్స్‌‌‌‌‌‌‌‌ యజమాని సయ్యద్‌‌‌‌‌‌‌‌ లడ్డూను దక్కించుకున్నారు.

11 లక్షలు పలికిన వినాయకుడి లడ్డూ

నల్గొండ అర్బన్​, వెలుగు : నల్గొండ పట్టణంలోని హనుమాన్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన ఒకటో నంబర్‌‌‌‌‌‌‌‌ వినాయకుడి లడ్డూ రికార్డు స్థాయి ధర పలికింది. ఈ లడ్డూను వేలంపాటలో బీజేపీ నాయకుడు ఏమిరెడ్డి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి రూ. 11 లక్షలకు దక్కించుకున్నారు. మంత్రి జగదీశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి లడ్డూను శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డికి అందజేశారు. తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న గణనాథుడు శుక్రవారం గంగ ఒడికి చేరుకున్నాడు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వినాయక శోభాయాత్ర, నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం మండపాల వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు పాల్గొన్నారు. అనంతరం మండప నిర్వాహకులు లడ్డూ వేలం పాటలు నిర్వహించారు. సాయంత్రానికి వినాయక విగ్రహాల ఊరేగింపు మొదలైంది. శోభాయాత్ర సందర్భంగా యువతీ, యువకులు డీజే పాటలకు డ్యాన్స్‌‌‌‌‌‌‌‌లు చేశారు. కళాకారులు ఆటపాటలతో ఆకట్టుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు.  

- వెలుగు నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌