తుది శ్వాస వరకు తెలంగాణ సిద్ధాంతాన్ని,సంక్షేమాన్ని కోరుకున్న మహనీయుడు

తుది శ్వాస వరకు తెలంగాణ సిద్ధాంతాన్ని,సంక్షేమాన్ని కోరుకున్న మహనీయుడు

తన తుది శ్వాస వరకు తెలంగాణ సిద్ధాంతాన్ని సంక్షేమాన్ని కోరుకున్న మహనీయుడు విద్యాసాగర్ రావని అన్నారు మంత్రి జగదీశ్వర్ రెడ్డి. దివంగత  ఆర్.విద్యాసాగర్ రావు విగ్రహాన్నిజలసౌధ, ఎర్రమంజిల్ లోని ఇంజనీర్స్ భవన్ లో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడిన జగదీశ్వర్ రెడ్డి.. నీటి రంగ నిపుణులు విద్యాసాగర్ రావు జయంతిని “తెలంగాణా ఇరిగేషన్ డే” గా ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. నీటిని కూడా కొలుస్తారని యావత్ తెలంగాణకు వివరించి చెప్పిన గొప్ప మహనీయుడు విద్యాసాగర్ రావన్నారు. సమైక్య రాష్ట్రంలో…నీటి పంపకాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై తన జీవితాంతం కృషి చేశారన్నారు. తెలంగాణా ఉద్యమంలో ముఖ్యంగా నీళ్ల పంపకాల్లో విద్యాసాగర్ రావు పాత్ర మరువలేనిదన్నారు. అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ప్రాంతాన్ని నీటి పంపకాల్లో ఏ విధంగా మోసం చేశాయో చెప్పేవారన్నారు.  సీఎం కేసీఆర్ కి భుజం తట్టి, వెంట నడిచారని…ప్రభుత్వ సలహాదారుగా సేవలు అందించారన్నారు. ఈ కార్యక్రమంలో నీటి పారుదల సెక్రటరీ రజత్ కుమార్ తో పాటు పలువురు విశ్రాంత ఇంజనీర్లు, అధికారులు పాల్గొన్నారు…