కేసీఆర్ ఢిల్లీకి రాకుండా అడ్డుకునే కుట్ర 

కేసీఆర్ ఢిల్లీకి రాకుండా అడ్డుకునే కుట్ర 
  • మంత్రి జగదీష్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా:  కేసీఆర్ను ఢిల్లీకి రాకుండా అడ్డుకునేందుకు ప్రధాని నరేంద్ర మోడీ పన్నిన కుట్రలో భాగంగానే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. మునుగోడు నియోజకవర్గం నారాయణపురం మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం, వనభోజన కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పెన్షన్లు, కరెంట్ వంటి పలు పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా అమలు కావడం లేదన్నారు. మునుగోడులో ఎన్నటికీ తీరని ఫ్లోరైడ్ సమస్యను తీర్చింది టీఆర్ఎస్ పార్టీనేనని పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని, బీజేపీకి మూడో స్థానమేనని మంత్రి జగదీష్ రెడ్డి జోస్యం చెప్పారు.