
ఆసిఫాబాద్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి జిల్లా ఇన్ చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. గురువారం కలెక్టర్ వెంకటేశ్ ధోత్రేతో ఫోన్లో మాట్లాడారు.
జిల్లాలో వర్షాలు భారీగా కురుస్తున్నాయని, వాగులు వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాలైన బెజ్జూరు, పెంచికల్పేట్, దహెగాం మండలాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.