
- మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాలు
కొల్లాపూర్, వెలుగు: కొల్లాపూర్ పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించి, భోజన నాణ్యతపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.అదనపు తరగతి గదులను వెంటనే ప్రారంభించాలన్నారు. కాంపౌండ్ వాల్ పనులు వేగవంతం చేయాలని పంచాయతీరాజ్ అధికారులకు సూచించారు. ఓ బాలిక తల్లిదండ్రులపై బెంగతో ఏడుస్తుండగా మంత్రి దగ్గరికి వెళ్లి ఓదార్చారు.
చుకాయిపల్లి గ్రామసభలో పాల్గొన్న మంత్రి, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికపై ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. నలుగురు అనర్హుల పేర్లను తొలగించాలని కమిషనర్‌కు ఆదేశాలు ఇచ్చారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా జరగాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు