రాష్ట్రంలో ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇండ్ల ఘనత కాంగ్రెస్దే : మంత్రి జూపల్లి కృష్ణారావు

రాష్ట్రంలో ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇండ్ల ఘనత కాంగ్రెస్దే :  మంత్రి జూపల్లి కృష్ణారావు

వీపనగండ్ల, వెలుగు: రాష్ట్రంలో ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్  ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వీపనగండ్ల మండలంలోని చిన్నమారు గ్రామంలో లబ్ధిదారులకు మంజూరైన ఇండ్లకు శనివారం ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలన్నారు. ఎవరైనా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

చిన్నంబావి మండలాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం పెద్ద దగడ గ్రామంలో పోతుగంటి స్వాములు మరణించడంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.  కాంగ్రెస్ ​చిన్నంబావి మండల అధ్యక్షుడు శేఖర్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రామచంద్రారెడ్డి, మాజీ జడ్పీటీసీ కృష్ణ ప్రసాద్ యాదవ్, మాజీ సర్పంచ్ బీచుపల్లి యాదవ్,   నాయకులున్నారు.