తూర్పు నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత నాదే : కొండా సురేఖ

తూర్పు నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత నాదే : కొండా సురేఖ

కాశీబుగ్గ, వెలుగు : వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం తన బాధ్యత అని మంత్రి కొండా సురేఖ చెప్పారు. వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నగరంలోని అబ్నూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫంక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శనివారం నిర్వహించిన ప్రీ క్రిస్మస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేడుకలకు వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రావీణ్యతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి, దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తాను మంత్రి అయినప్పటికీ తన తొలి ప్రాధాన్యం తూర్పు నియోజకవర్గ అభివృద్ధికే ఇస్తానన్నారు. 

పాస్టర్లు, అర్చకులు, ఇమామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు గౌరవవేతనం పెంపు అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చామని, అందుకు అనుగుణంగా రూ.12 వేలు ఇచ్చేలా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు గుండేటి నరేందర్, పోశాల పద్మ, పల్లం పద్మ, మరుపల్ల రవి, గుండు చందన, పాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాబుజగ్జీవన్, గంధ అరుణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అబ్రహం, మైనార్టీ నాయకులు మహ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆయూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కిన్నెర రవి, గిన్నారం రాజు, సందెల లాజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు. 
 

2012 బ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్సైలకు ప్రమోషన్లు ఇవ్వాలి
 

హనుమకొండ, వెలుగు : తమకు ప్రమోషన్లు ఇవ్వాలంటూ 2012 బ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఎస్సైలు శనివారం వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంత్రి కొండా సురేఖను కలిశారు. జోనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యవస్థలో వచ్చిన మార్పుల వల్ల తాము తీవ్రంగా నష్టపోయామన్నారు. తమ బ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన కొందరికి మూడేళ్ల కిందటే ప్రమోషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చిందని, తమకు మాత్రం అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.