హుజురాబాద్ ప్రజలు మళ్లీ ఆ తప్పు చేయొద్దు : కేటీఆర్

హుజురాబాద్ ప్రజలు మళ్లీ ఆ తప్పు చేయొద్దు : కేటీఆర్

జమ్మికుంట సభకు తరలివచ్చిన జనాన్ని చూస్తే  హుజురాబాద్ గడ్డపై మళ్లీ గులాబీ జెండా ఎగురుతుందన్న నమ్మకం కలుగుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. 14 నెలల కింద ఇక్కడ జరిగిన ఉపఎన్నికల్లో ఈటల మాటలు నమ్మి ఆయనను గెలిపించారని ... ఇప్పటివరకు ఢిల్లీ నుంచి  ఒక్క పైసా అయినా తెచ్చిండా అని ప్రశ్నించారు. వారివి శుష్క ప్రియాలు.. శూన్య హస్తాలు అని మంత్రి విమర్శించారు. కేసీఆర్ పాలనను అరిష్టమని ఈటల అంటున్నాడని.. ఎవరి పాలన అరిష్ఠమో అందరికీ తెలుసునన్నారు.

ఈటలకు నిజాయితీ ఉంటే మోడీ రూ.100 లక్షల కోట్లు అప్పు చేసింది నిజమో కాదో చెప్పాలని మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. చంపుకుంటరో సాదుకుంటరో అనే సెంటిమెంట్ డైలాగులకు పడిపోయి మరోసారి హుజురాబాద్ ప్రజలు తప్పు చేయవద్దనని కేటీఆర్ ప్రజలను కోరారు. టీఆర్ఎస్ పార్టీ పేరు మారింది తప్ప డీఎన్ఏ, జెండా, గుర్తు మారలేదన్నారు. హుజురాబాద్ కు ఇంకా చేయాల్సింది చాలా ఉందన్న కేటీఆర్ త్వరలోనే వాటిని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.