షేక్పేట ఫ్లైఓవర్ ప్రారంభించనున్న కేటీఆర్

షేక్పేట ఫ్లైఓవర్ ప్రారంభించనున్న కేటీఆర్

హైదరాబాద్: సిటీలో మరో కొత్త ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయింది. రీసెంట్ గా ఓవైసీ మిథానీలో ఫ్లైఓవర్ ఆరంభమవ్వగా.. ఇప్పుడు షేక్ పేట్ లో నిర్మించిన మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. రూ.333 కోట్ల వ్యయంతో 2 కిలో మీటర్లకు పైగా ఆరు లేన్లతో ఈ ఫ్లైఓవర్ నిర్మించారు. టోలిచౌకీ నుంచి రాయదుర్గాన్ని కలిపే ఈ ఫ్లైఓవర్ ద్వారా ట్రాఫిక్ కష్టాలు కొంతమేర తీరనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కొత్త ఫ్లైఓవర్ గురించి ట్వీట్ చేశారు. నూతన ఏడాదిని సరికొత్తగా ఆరంభిస్తున్నామని ఆయన అన్నారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ తగ్గించే దిశగా ఇది మరో మైలురాయి అని పేర్కొన్నారు. ఇందుకు కృషి చేసిన SRDP ఇంజినీరింగ్ టీమ్ ను మెచ్చుకున్నారు. 

కాగా, సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చేందుకు హైదరాబాద్ లోని ప్రధాన రోడ్లపై ఫ్లై ఓవర్స్, అండర్ పాస్ ల నిర్మాణానికి జీహెచ్ఎంసీ రూపకల్పన చేసింది. కొన్ని ఏరియాలో ఫ్లై ఓవర్స్ తో ట్రాఫిక్ లేకుండా పోయినప్పప్పటికీ.. మరికొన్ని ఏరియాల్లో షరా మమూలుగానే జనాలు ట్రాఫిక్ తో ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో భాగంగా రూ.30 వేల కోట్లతో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ కింద.. నగరంలో ఫ్లైఓవర్ లను నిర్మిస్తున్నారు. ఇప్పటికే కొన్నింటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. బాలా నగర్, గచ్చిబౌలి, బయో డైవర్సిటీ, సైబర్ టవర్స్, మైండ్ స్పేస్ జంక్షన్ తో పాటు ఎల్బీనగర్ దగ్గర ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లు అందుబాటులోకి వచ్చాయి. రీసెంట్ గా ఒవైసీ మిథాని కూడలిలో మరో ప్లై ఓవర్ ప్రారంభించారు. దీంతో పాత బస్తీ నుంచి ఎల్బీనగర్ వైపు ట్రాఫిక్ కష్టాలు కొంత తొలగిపోనున్నాయి. 

మరిన్ని వార్తల కోసం: 

వైష్ణో దేవి ఆలయంలో తొక్కిసలాట.. 12 మంది మృతి

దొంగ అని పొరబడి.. కూతురిని కాల్చేసిండు

పుష్ఫరాజ్ అనుకుని మరొకరి ఇంట్లో రైడ్స్