ఇంటి స్థలం ఉంటే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తాం

ఇంటి స్థలం ఉంటే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తాం

విమర్శలు చేయడం ఈజీనే కానీ పనులు చేయడం కష్టమని అన్నారు మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా  ఎల్లారెడ్డి పేట మండలంలోని వెంకటాపుర్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించారు మంత్రి కేటీఆర్. 40 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ లు పంపిణీ చేసి,లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు.  ఈ సందర్బంగా మాట్లాడిన కేటీఆర్..దేశంలో ఎక్కడా ఇటువంటి డబుల్ బెడ్రూం ఇల్లు లేవన్నారు. సొంత ఇంటి స్థలం ఉన్నవారికి  డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తామన్నారు. అన్ని సంఘాల భవనాలు త్వరలోనే పూర్తవుతాయన్నారు.కొన్నింటికి ఇప్పటికే మంజూరు చేశామన్నారు. తెలంగాణ రాకముందు  ఊరికి రూ. 50 లక్షలు రావడమే కష్టంగా ఉండేది..కానీ ఇప్పుడు రూ. 5 కోట్లకు పైనే నిధులు వస్తున్నాయన్నారు.  విమర్శలు చేసేవారు దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఇలాంటి అభివృద్ధి పనులు జరిగాయా చెప్పాలన్నారు. తమపై విమర్శలు చేసేటోళ్లు గతంలో ఏమి చేశారో చెప్పాలన్నారు. సిరిసిల్ల రూపు మార్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు కేటీఆర్.

మరిన్ని వార్తల కోసం:

పలువురు ఐపీఎస్లకు తాత్కాలిక పోస్టింగ్

కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా

విరాట్ వందో టెస్టులో జడేజా సెంచరీ