ఆటోడ్రైవర్ అన్నాదురైని ప్రశంసించిన కేటీఆర్

ఆటోడ్రైవర్ అన్నాదురైని ప్రశంసించిన  కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర మంత్రి  కేటీఆర్ తమిళనాడుకు చెందిన ఆటోడ్రైవర్ అన్నాదురై పై ప్రశంసలు కురిపించారు. ఆటో డ్రైవ‌ర్ అన్నాదురై ఇటీవల తన ఆటోలో ఐపాడ్, ల్యాప్‌ల్యాప్, ఫ్రిజ్, స్నాక్న్, కూల్‌డ్రింక్స్,ఫ్రీ వైఫై, మ్యాగజైన్‌లను వంటి పలు సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చాడు. దీంతో అన్నాదురై ఆటోలోని సౌకర్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తనకు డబ్బు కంటే కస్టమర్ల సంతోషమే ముఖ్యమని.. అందుకని కస్టమర్ల కోసం పలు లగ్జరీ గాడ్జెట్స్‌ను అందుబాటులో ఉంచానని అన్నాదురై తెలిపాడు.

 అన్నాదురై గత పదేళ్లుగా  ఆటో డ్రైవర్‌గా పనిచేస్తుండగా ప్రయాణికుల అవసరాలు తెలుసుకుని తన ఆటోలో అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నాడు. ఈ విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి కూడా వచ్చింది. చెన్నైకి చెందిన ఆటోడ్రైవర్ అన్నాదురై తన ఆటోను ప్రపంచ స్థాయి సదుపాయాలతో తీర్చిదిద్దాడని… ఇది గొప్ప ఆలోచన అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.