మహిళ భద్రతకు బస్‌‌లో భరోసా: కేటీఆర్

మహిళ భద్రతకు బస్‌‌లో భరోసా: కేటీఆర్

రాజన్న సిరిసిల్ల, వెలుగు: మహిళ భద్రతకు సిరిసిల్ల పోలీస్ షీ టీం ఆధ్వర్యంలో బస్‌‌లో భరోసా అమలు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్​ తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల కలెక్టరేట్‌‌లో మంత్రి కేటీఆర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా 77 బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. త్వరలోనే అన్ని బస్సుల్లో కూడా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. 

తెలంగాణలో మహిళల రక్షణకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందన్నారు. శాంతి భద్రతల రక్షణలో తెలంగాణ పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు.  నేరాల నియంత్రణలో తెలంగాణ  పోలీసులు నంబర్‌‌‌‌వన్‌‌గా నిలుస్తున్నారన్నారు. కార్యక్రమంలో మానకొండూర్ ఎమ్యెల్యే రసమయి బాలకిషన్, జడ్పీ చైర్‌‌‌‌పర్సన్ అరుణ , టెక్స్ టైల్స్‌‌, పవర్ లూమ్ కార్పొరేషన్  చైర్మన్ గూడూరి ప్రవీణ్, టెస్కాబ్​చైర్మన్ రవీందర్, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహజన్ పాల్గొన్నారు