ఫలితాలు నిరాశపర్చినా.. అసంతృప్తి లేదు : కేటీఆర్

ఫలితాలు నిరాశపర్చినా.. అసంతృప్తి లేదు : కేటీఆర్

తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందిన తర్వాత మొదటిసారి ప్రెస్ మీట్ ముందుకు వచ్చారు మంత్రి కేటీఆర్. ప్రజా తీర్పును తాము గౌరవం ఇస్తామన్నారు. రాజకీయ ప్రస్థానంలో తాము ఎన్నో ఎత్తుపల్లాలు చూశామన్నారు. కాంగ్రెస్ పార్టీ మంచి ప్రభుత్వాన్ని నడపాలని కోరుకుంటున్నామని తెలిపారు. ప్రజలిచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు. ఫలితాలు నిరాశపర్చినా.. అసంతృప్తి లేదన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరూ నిరాశపడొద్దని సూచించారు.

సీఎం కేసీఆర్ రాజీనామా పత్రాన్ని గవర్నర్ కు పంపారని మంత్రి కేటీఆర్ చెప్పారు. పదేళ్లు ప్రజలకు విశ్వసనీయంగా పని చేశామన్నారు. కొత్త పాత్రలోనూ (ప్రతిపక్షం) ప్రజలకు సేవలందిస్తామని హామీ ఇచ్చారు. ఓటమిపై తమ పార్టీ నాయకుల అనుభవాలను తీసుకుంటామని చెప్పారు. సింగరేణి సంస్థకు తాము చేసిన సేవలు ఏ పార్టీ చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణాత్మకంగా పని చేసేలా సహకరిస్తామన్నారు.