రేపు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ టూర్ 

రేపు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ టూర్ 

నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ శనివారం (ఈనెల 14న) పర్యటించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో రూ.50 కోట్లతో జరిగే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. నాగార్జునసాగర్ లోని బుద్ధవనం, హైదరాబాద్ మహానగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు పెద్దవూర మండలం సుంకిశాలలో పంప్ హౌస్  ఏర్పాట్లను పరిశీలించనున్నారు. హాలియాలో నిర్వహించే బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడనున్నారు. KTR టూర్ ఏర్పాట్లను జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా MLC కోటిరెడ్డి, ఎమ్మెల్యే నోముల భగత్, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అధికారులు పరిశీలించారు. 

మరిన్ని వార్తల కోసం..

బుద్ధవనం ప్రాజెక్టుకు కేంద్ర నిధులు

ఫ్యూచరంతా ఓటీటీలదే..