పెట్రో ధరల పెంపుపై కేంద్రానికి కేటీఆర్ బహిరంగ లేఖ

పెట్రో ధరల పెంపుపై కేంద్రానికి కేటీఆర్ బహిరంగ లేఖ

పెట్రో ధరల పెంపును వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి  మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. పెట్రో ధరల పెంపుతో ప్రతీ రోజూ ప్రజల రక్తం పీలుస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరును ఈ లేఖ ద్వారా తెలియజేయాలనుకుంటున్నానని కేటీఆర్ అన్నారు. ఒకవైపు నిరంతరం ధరలను పెంచుతూనే.. మరోవైపు ఆ పాపాన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై నెట్టే ఒక కుటిల ప్రయత్నానికి కేంద్రంలోని బీజేపీ ఒడిగడుతుందని ఆయన అన్నారు. నిజం చెప్పులేసుకునేలోపు.. అబద్ధం ఊరంతా బలాదూర్‎గా తిరిగొస్తుందని... అందుకే  దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అత్యంత భారీగా పెట్రో రేట్లు పెంచిన కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాలు, అది చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజల ముందు ఎండగట్టేందుకే ఈ లేఖ రాస్తున్నానని కేటీఆర్ చెప్పారు.
 

కేటీఆర్ లేఖలోని ముఖ్యాంశాలు:

• సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అని గప్పాలు చెప్పుకునే మోడీ గారి పాలనలో సబ్ కా సత్తేనాశ్ అయింది.
• అంతర్జాతీయంగా ముడి చమురు రేట్లు పెరిగినా, తగ్గినా.. దేశంలో మాత్రం రేట్లు పెంచడమే కేంద్రం తమ పనిగా పెట్టుకుంది. 
• దేశ ఆర్థిక వ్యవస్థను నడపలేక  బీజేపీ అవలంబిస్తున్న  అసమర్థ విధానాలే ప్రస్తుత ఈ దుస్థితికి కారణం.
• పన్నులు పెంచడమే పరిపాలనగా భ్రమిస్తుంది.
• దేశంలో ఉన్న 26 కోట్ల కుటుంబాల నుంచి 26.51 లక్షల కోట్ల రూపాయల పెట్రో పన్నును వేసిన పనికిమాలిన ప్రభుత్వం బీజేపీదే.
• ఒక్కో కుటుంబం నుంచి లక్ష రూపాయాల పెట్రో పన్నును కేంద్రం దోచుకుంది.
• ప్రతిది దేశం కోసం..  ధర్మం కోసం అంటారు. ఈ దోపిడీ కూడా... దేశం కోసం.. ధర్మం కోసమేనా?
• ఒకవైపు భారీగా పెట్రో ధరలను పెంచుతున్న కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించాలంటే మాత్రం వితండ వాదం చేస్తుంది.
• పెట్రో ధరల పేరిట ప్రజల జేబులను దోచుకుంటున్న పార్టీ బీజేపీ. అందుకే అచ్చేదిన్ కాదు.. అందర్నీ ముంచే దిన్ అనుకుంటున్నారు.
• ప్రజలను దోపిడి చేయడమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రధానమంత్రి పెట్రో పన్ను యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది.
• పెట్రో ధరల పెంపును అడ్డుకోవడంలో విఫలమయ్యామని దేశ ప్రజలను ప్రధాని క్షమాపణ కోరాలి.
• పెట్రో ధరల బాదుడు ఆపకపోతే.. ప్రజలు తిరస్కరించడం ఖాయం.

For More News..

భారత్లో ప్రవేశించిన కరోనా కొత్త వేరియెంట్

కేసీఆర్ సంత‌కం రైతులకు మరణశాసనమైంది

ఫ్రీ కోచింగ్‎తో పాటు రూ. 5 వేల స్టైఫండ్