కేసీఆర్ ఆధ్వర్యంలో ఘనంగా సమైక్యతా వజ్రోత్సవాలు

కేసీఆర్ ఆధ్వర్యంలో ఘనంగా సమైక్యతా వజ్రోత్సవాలు

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: సెప్టెంబర్ 17 అనేది నిజాం రాజరిక పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగిన గొప్ప రోజు అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను పురస్కరించుకొని  కలెక్టరేట్ లో మంత్రి మల్లారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగావిద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరినీ కట్టిపడేశాయి. బాలానగర్ డీసీపీ సందీప్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీసుల కవాతు ఆకట్టుకుంది. అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ సంస్కృతిని  ప్రతిబింబించేలా విద్యార్థుల ప్రదర్శనలు ఉన్నాయని ప్రశంసించారు. రాచరిక పాలనకు వ్యతిరేకంగా ఎంతో మంది పోరాడారన్నారు.  వారి పోరాట ఫలితంగా 1948, సెప్టెంబర్ 17న తెలంగాణ రాష్ట్రం భారత్ లో విలీనం అయ్యిందన్నారు.

సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17ను పురస్కరించుకొని మూడు రోజుల పాటు జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల పేరుతో వేడుకలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి మల్లారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.