అలర్ట్​గా ఉండండి.. భయపడొద్దు : మన్​సుఖ్ మాండవీయ

అలర్ట్​గా ఉండండి.. భయపడొద్దు : మన్​సుఖ్ మాండవీయ

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని, అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్​సుఖ్ మాండవీయ సూచించారు. అలర్ట్​గా ఉంటే సరిపోతుందని, భయపడాల్సిన అవసరం లేదన్నారు. జేఎన్1 వేరియంట్ కేసులు కూడా పలు రాష్ట్రాల్లో నమోదైనట్లు వివరించారు. అన్ని హాస్పిటల్స్​లో కరోనా వార్డులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అవసరమైన హెల్త్ ఎక్విప్​మెంట్ సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో బుధవారం మన్​సుఖ్ మాండవీయ అధ్యక్షత న హై లెవల్ మీటింగ్ జరిగింది. 

ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘‘ఇంకా కరోనా వైరస్ పోలేదు. అన్ని రాష్ట్రాలకు రిక్వెస్ట్ చేసేది ఒకటే.. అలర్ట్​గా ఉండండి. ఎప్పటికప్పుడు రివ్యూ చేయండి. హాస్పిటల్స్​లో సౌలత్​లు ఏర్పాటు చేసుకోండి. ప్రజలకు అవగాహన కల్పించండి. కేంద్రం నుంచి అన్ని విధాలుగా సహకారం ఉంటుంది. ప్రజల హెల్త్​కు సంబంధించిన విషయం ఇది. దీన్ని రాజకీయం చేయొద్దు” అని మన్​సుఖ్ మాండవీయ కోరారు.