జనం గుండెల్లోని ప్రజారాజధాని అమరావతి.. మోదీ చేసిన శంకుస్థాపనను ఆపే దమ్ము ఎవరికీ లేదు: మంత్రి లోకేష్

జనం గుండెల్లోని ప్రజారాజధాని అమరావతి.. మోదీ చేసిన శంకుస్థాపనను ఆపే దమ్ము ఎవరికీ లేదు: మంత్రి లోకేష్

అమరావతి: జనం గుండెల్లోని ప్రజారాజధాని అమరావతి అని.. ప్రధాని మోడీ చేసిన శంకుస్థాపనను ఆపే దమ్ము ఎవరికీ లేదని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనులు ఇక అన్ స్టాపబుల్‎గా కొనసాగుతాయని పేర్కొన్నారు. శుక్రవారం  వెలగపూడిలో ఏర్పాటు చేసిన అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో లోకేష్ మాట్లాడుతూ.. 2014లో మనల్ని మెడపట్టి గెంటేశారు. రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండానే విడిపోయాం. అయినప్పటికి చంద్రబాబు ఆత్మస్థైర్యం కోల్పోకుండా రాష్ట్రాన్ని నిలబెట్టారని అన్నారు. 

Also Read : ఏపీలో ప్రధాని..గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న మోదీ

కానీచంద్రబాబుపై కక్షతో గత ప్రభుత్వం రాజధాని అమరావతిని చంపేసిందని ఆరోపించారు. జై అమరావతి అన్నందుకు రైతులను గత ప్రభుత్వం పెయిడ్ ఆర్టిస్టులు అన్నదని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు, అరాచకాలు సృష్టించిన అమరాతి రైతులు ఉద్యమంలో వెనక్కి తగ్గలేదని పేర్కొన్నారు. అమరావతికి నిర్మాణానికి అప్పుడు మోడీనే శంకుస్థాపన చేశారు. మళ్లీ ఇప్పుడు పునర్నిర్మాణ పనులను ఆయనే ప్రారంభిస్తున్నారని అన్నారు.