అభివృద్ధిని చూసి ఓటేయాలి: నిరంజన్ రెడ్డి

అభివృద్ధిని చూసి ఓటేయాలి:  నిరంజన్ రెడ్డి

వనపర్తి, వెలుగు: జిల్లా కేంద్రంతో పాటు  నియోజకవర్గం పరిధిలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధిని చూసి ఓటేయాలని మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు. శుక్రవారం మార్నింగ్ వాక్ లో భాగంగా పాలిటెక్నిక్  కాలేజీ గ్రౌండ్ లో ఓటర్లను కలిశారు. వనపర్తి ఓటర్లు ఎంతో చైతన్యవంతులని, తాను చేసిన అభివృద్ధిని చూసి ఆశీర్వదిస్తారని చెప్పారు.

జిల్లా అధికార ప్రతినిధి  వాకిటి శ్రీధర్, మార్కెట్  మాజీ చైర్మన్  లక్ష్మారెడ్డి, జిల్లా గొర్రెల పెంపకదారుల సహకార యూనియన్  డైరెక్టర్  బీచుపల్లి యాదవ్, కోళ్ల వెంకటేశ్, రవి చారి పాల్గొన్నారు.