ధాన్యం సేకరణలో రాష్ట్రాల పాత్ర పరిమితం

ధాన్యం సేకరణలో రాష్ట్రాల పాత్ర పరిమితం

ధాన్యం కొనుగోళ్లపై పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అవాస్తవాలు చెప్పారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ధాన్యం సేకరణలో రాష్ట్రాల పాత్ర పరిమితంగా ఉంటుందని ఆయన చెప్పారు. తన వాటా బియ్యం తీసుకెళ్లకుండా కేంద్రం.. రాష్ట్రంపై నిందలు వేస్తోందని మంత్రి అన్నారు. యాసంగిలో వడ్లు కొనడం లేదని కేంద్రం చెప్పినందున, వరి కాకుండా వేరే పంటలు వేయాలని రైతులకు సూచిస్తున్నామని అన్నారు నిరంజన్ రెడ్డి.

మరోవైపు కాంగ్రెస్ పార్టీపైనా మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపణలు చేశారు. దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అని చెప్పుకునే పార్టీ.. దాదాపు ఏడాది పాటూ రైతులు ఉద్యమం చేస్తే అందులో వాళ్ల పాత్ర లేకపోవడం శోచనీయమని అన్నారు. పార్లమెంట్‌లో అన్ని పార్టీలను కలుపుకొని కేంద్రంపై కొట్లాడాల్సిన పార్టీ ఆ పని చేయడం లేదన్నారు. ప్రస్తుతం పార్లమెంటు పోరాడుతున్న ఏకైక పార్టీ టీఆర్‌‌ఎస్ మాత్రమేనని నిరంజన్ రెడ్డి అన్నారు. ఉద్యమ సమయం నుంచి కూడా ఆ పార్టీ ప్రజా సమస్యలపై కలిసి రావడం లేదన్నారు.