పదో విడత రైతుబంధు కింద రూ.7,670 కోట్లు : నిరంజన్ రెడ్డి

పదో విడత రైతుబంధు కింద రూ.7,670 కోట్లు  : నిరంజన్ రెడ్డి

రాష్ట్రంలో వ్యవసాయ రంగం రోజురోజుకు అభివృద్ధి చెందుతోందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. పదో విడత రైతు బంధు కింద రైతులకు రూ.7,670 కోట్లు ఇస్తున్నట్లు చెప్పారు. రైతుబంధు రూపంలో అన్నదాతలకు ఇప్పటి వరకు రూ.65,559 కోట్లు ఇచ్చామని అన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో మామిడి మార్కెట్‭ను అభివృద్ధి చేసి మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కేంద్రం మద్దతు ధర ఇవ్వకున్న ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుండి వడ్లు కొంటున్నామని నిరంజన్ రెడ్డి భరోసా ఇచ్చారు.

వ్యవసాయ రంగం ద్వారానే మిగతా రంగాలు అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి నిరంజన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 2014కు ముందు రాష్ట్రంలో అన్ని పంటల దిగుబడి 68 లక్షల టన్నులు కాగా.. గతేడాది నాటికి అది 3కోట్ల 50లక్షల టన్నులకు చేరిందని స్పష్టం చేశారు.