అలంపూర్​ డెవలప్​మెంట్​పై ప్రత్యేక దృష్టి : నిరంజన్ రెడ్డి

అలంపూర్​ డెవలప్​మెంట్​పై ప్రత్యేక దృష్టి : నిరంజన్ రెడ్డి

అలంపూర్/అయిజ/పెద్దమందడి, వెలుగు: అలంపూర్  నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో డెవలప్​ చేయడంపై సీఎం కేసీఆర్  ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో కొత్తగా ఏర్పాటు చేసిన 100 పడకల ఆసుపత్రిని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. 

మెరుగైన వైద్యం కోసం కర్నూల్  వెళ్లాల్సి వచ్చేదని, ఇక నుంచి అలంపూర్​లోనే వైద్యం దొరుకుతుందని చెప్పారు. కొద్ది రోజుల్లో అన్ని సౌలతులు కల్పిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ నియోజకవర్గంలో రూ.125.23 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం అయిజ- మండల కేంద్రంలో పీఏసీఎస్​ ఆధ్వర్యంలో రూ.77 లక్షలతో ఏర్పాటు చేసిన సూపర్ మార్కెట్, రూ.3 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్  వెజ్ అండ్ నాన్ వెజ్  మార్కెట్​ను ప్రారంభించారు. 

అడిషనల్ కలెక్టర్  అపూర్వ చౌహాన్, ఆర్డీవో చంద్రకళ, ఎంపీపీలు రజిత, బీసమ్మ, జడ్పీటీసీలు రాజు, రాములమ్మ, సర్పంచులు లోకేశ్వర్ రెడ్డి, నారాయణమ్మ, రేఖ పుల్లూరు, ఎంపీటీసీ వరలక్ష్మి తనగల సీతారామరెడ్డి, మున్సిపల్  చైర్ పర్సన్ దేవన్న, పీఏసీఎస్  చైర్మన్ మధుసూదన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే పెద్దమందడి మండల కేంద్రంలో నిర్మించిన సర్వ వర్గ సామూహిక భవనాన్ని మంత్రి ప్రారంభించారు. జగదీశ్వర్ రెడ్డి, రఘుపతి రెడ్డి, రాజప్రకాష్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, మన్యపు రెడ్డి, వేణు యాదవ్  పాల్గొన్నారు.

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు అందజేత

వనపర్తి: పట్టణంలోని మంత్రి క్యాంప్​ ఆఫీస్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 75 మంది జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల పట్టాలను అందజేశారు. రెండో విడతలో మిగిలిన వారికి ఇస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మెంటెపల్లిలో 55, పెద్దగూడెంలో 38 మంది లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు అందజేశారు. వనపర్తి పట్టణానికి చెందిన109 మందికి రూ. లక్ష చొప్పున బీసీ బంధు చెక్కులను మంత్రి అందజేశారు.