
పూర్తి స్థాయి బడ్జెట్ రూపకల్పనలో బిజీగా ఉన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ఆర్థికమంత్రులతో ప్రి-బడ్జెట్ మీటింగ్ నిర్వహించారు. ఆర్థిక శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ సహా ఆర్థిక శాఖ ముఖ్య అధికారులు, రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, అధికారులు కూడా పాల్గొన్నారు.