కాణిపాకంలో వినాయక చవితి వేడుకలు

కాణిపాకంలో వినాయక చవితి వేడుకలు
  • పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

ఆంధ్రప్రదేశ్ లోని కాణిపాకం వరసిద్ది వినాయక క్షేత్రాన్ని రాబోయే రోజుల్లో మాస్టర్ ప్లాన్ ప్రకారం రూ.150 కోట్లతో అభివృద్ధి చేస్తామని విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. కాణిపాకం క్షేత్రంలో ఘనంగా నిర్వహించిన చవితి వేడుకలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సతీసమేతంగా హాజరై పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఎం.ఎస్. బాబు, జెడ్పీ చైర్మన్  గోవిందప్ప శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 

దర్శనం అనంతరం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాణిపాకం ఆలయం చాలా ప్రసిద్ది చెందిన దేవాలయం.. ప్రభుత్వం తరపున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు. ఈ క్షేత్రము ఇంకా బాగా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో మాస్టర్ ప్లాన్ ప్రకారం మరింత పెద్ద క్షేత్రం గా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. 

దర్శనం కోసం పోటెత్తిన భక్తులు

వినాయక చవితి సందర్భంగా కాణిపాక వరసిద్ది వినాయక స్వామి వారి ఆలయం లో దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్ లు ఏర్పాటు చేశారు. ఉచిత దర్శనానికి, 100 రూ ల దర్శనానికి ఏర్పాటు చేసిన  ప్రత్యేక క్యూ లైన్ లన్నీ భక్తులతో కిక్కిరిసి పోయాయి. వృద్ధులు. వికలాంగులకు  వి ఐ పి క్యూ లైన్ ద్వారా అనుమతిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.