మూసీపై బురద రాజకీయాలు మానుకోవాలి.. అన్ని పార్టీల మద్దతుతోనే బీసీ రిజర్వేషన్లు: మంత్రి పొన్నం

మూసీపై బురద రాజకీయాలు మానుకోవాలి.. అన్ని పార్టీల మద్దతుతోనే బీసీ రిజర్వేషన్లు: మంత్రి పొన్నం

మిర్యాలగూడ, వెలుగు : మూసీపై బీఆర్ఎస్, బీజేపీ బురద రాజకీయాలు మానుకోవాలని బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ప్రభుత్వం 12 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు పంపినట్లు చెప్పారు ఆదివారం  (సెప్టెంబర్ 28) మిర్యాలగూడ టౌన్ లో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తో కలిసి  మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

రాష్ట్ర ప్రభుత్వ ప్రజా పాలనలో ఎవరెంతో.. వారికి వాటా అంత.. అనే నినాదంతో బీసీ రిజర్వేషన్లు చేసినట్టు పేర్కొన్నారు. అన్ని పార్టీల, ప్రజా సంఘాల మద్దతుతో రిజర్వేషన్లు చేసి ఫైల్ ను గవర్నర్ నుంచి రాష్ట్రపతికి పంపినట్లు తెలిపారు. 42 శాతంతో ఎవరికి నష్టం లేదని తెలిపారు.