హుస్నాబాద్‌‌‌‌‌‌‌‌కు సాగునీరందించే బాధ్యత నాది : మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్‌‌‌‌‌‌‌‌కు సాగునీరందించే బాధ్యత నాది : మంత్రి పొన్నం ప్రభాకర్

చిగురుమామిడి, వెలుగు: గౌరవెల్లి ప్రాజెక్ట్ కాల్వలకు భూసేకరణ జరుగుతోందని, హుస్నాబాద్ నియోజకవర్గానికి సాగునీరందించే బాధ్యత తనదని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. చిగురుమామిడి మండలం సీతారాంపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గ్రామం నుంచి పర్లపల్లి వరకు నిర్మించిన బీటీ రోడ్డును శుక్రవారం కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పమేలా సత్పతితో కలిసి ప్రారంభించారు. అనంతరం సుందరగిరి ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు.

 చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో రూ.4.90 కోట్ల పనులకు  ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నట్లు చెప్పారు. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు గరిమా అగర్వాల్, తానాజీ, ఇతర అధికారులు, లీడర్లుపాల్గొన్నారు.