ఓటమి భయంతో.. రాజకీయ డ్రామాలకు తెరలేపారు: మంత్రి పొన్నం

ఓటమి భయంతో.. రాజకీయ డ్రామాలకు తెరలేపారు: మంత్రి పొన్నం

బండి సంజయ్ రాజకీయ డ్రామాలకు  తెరలేపారని ఫైర్ అయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఫిబ్రవరి26వ తేదీ సోమవారం కరీంనగర్ లో బండి సంజయ్ మాట్లాడుతూ..  రాముడు అయోధ్యలో పుట్టాడనేందుకు గ్యారంటీ ఏంటని కాంగ్రెస్ నేతలు అంటున్నారని..  రాముడు అయోధ్యలోనే పుట్టినట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయని.. మరి మీరు మీ తల్లికే పుట్టారనేందుకు గ్యారంటీ ఏంటని సంచలన వ్యాఖ్యలు చేశారు.  బండి వ్యాఖ్యలపై మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. 

 సోమవారం ఎన్నికల ప్రచార సందర్భంగా తాను బండి సంజయ్ ని ప్రశ్నించాను.. 5 సంవత్సరాల పదవి కాలంలో బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు ఎం చేసారని ప్రశ్నించానన్నారు. శ్రీరాముని పేరు మీద ఓట్ల ఆడగడం కాదు.. మీరు నిజంగా నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారో చెప్పాలన్నారు. రాముడి పట్టుక గురించి, అక్షింతల గురించి తాను ఎన్నడూ ఆనంటువంటి  మాటలను  మాట్లాడలేదన్నారు మంత్రి. తన తల్లి జన్మకు సంబంధించిన మాటలు బండి మాట్లాడుతున్నారని.. ఇది ఎంత వరకు సమంజసమని సభ్య సమాజాన్ని కొరుతున్నానన్నారు . రాజకీయంగా అడిగిన ప్రశ్న.. అభివృద్ధికి సంబంధించినది అయితే.. అతను తన పుట్టుక గురించి మాట్లాడటం ఎంతవరకు కరెక్టు.. సమాజం గమనించాలని కోరారు.

రాజకీయంగా డ్రామాలు చేస్తూ.. బండి సంజయ్ యాత్రను కొనసాగిస్తున్నాడని విమర్శించారు పొన్నం ప్రభాకర్. అతని యాత్రకు ప్రచారం రావాలని అడ్డుకున్నట్టు కొత్త డ్రామాలకు తెరలేపారు మండిపడ్డారు. మేము మీ యాత్రలు అడ్డుకోవడం లేదని.. ప్రజాస్వామ్యంలో యాత్ర చేసే హక్కు ఉందన్నారు. మీరు మాట్లాడిన మాటలపై చట్టరిత్య చర్యలు తీసుకోవాలని అంటున్నారు.. ప్రజలే మనకు చట్టం .. ప్రజాస్వామ్యమే మనకు చట్టం.. ఈ ప్రజల ముందు తాను అడుగుతున్నా.. తన జన్మ గురించి మాట్లాడుతున్న అతని పట్ల ఒకసారి ఆలోచన చేయండన్నారు.

ALSO READ :- ఏనుగు దాడిలో ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు..

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర, కేంద్ర నాయకత్వం ఆలోచించాలి.. ఇటువంటి నాయకుడి డ్రామాలకు సమర్థిస్తున్నారా..? అని అడుగుతున్నానని అన్నారు. ఈ నియోజకవర్గానికి సంబంధించి ఐదేళ్లలో మీరేం చేశారు.. తాను ఎంపీగా ఉన్నప్పుడు తనేం చేశానో ప్రజలు గమనించాలన్నారు. మీరు నియోజకవర్గాల్లో ఏం చేయలేదని ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని ఓడిపోతాననే భయంతో ఇటువంటి ప్రస్తావన తీసుకొస్తున్నారని దుయ్యబట్టారు మంత్రి పొన్నం.  తల్లి మాట నీ సమాధికి కారణం కాబోతుంది బండి సంజయ్.. జాగ్రత్త అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము హింసావాదులం కాదు.. శవం మీద పేలాలు ఏరుకునే రకం కాదు.. యాత్ర చేసుకో ఏమైనా చేసుకో.. మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం.. మేము యాత్రకి అడ్డుపడతలేం.. నోరు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు అంటూ బండి సంజయ్ కి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు.