అధికారులు రెడీగా ఉండాలి .. మంత్రి ప్రోగ్రామ్స్​ను సక్సెస్ చేద్దాం : అనుదీప్

అధికారులు రెడీగా ఉండాలి .. మంత్రి ప్రోగ్రామ్స్​ను సక్సెస్ చేద్దాం : అనుదీప్
  • ప్రజావాణి పెండింగ్​అర్జీలు త్వరగా పరిష్కరించండి
  • అధికారులను ఆదేశించిన హైదరాబాద్​ 

హైదరాబాద్​, వెలుగు :  హైదరాబాద్​ జిల్లా ఇన్​చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ త్వరలో భవనాలు, అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని, జిల్లా అధికారులు సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని కలెక్టర్​అనుదీప్​ ఆదేశించారు. మంత్రి ప్రోగ్రామ్స్​లో  ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్​లో జరిగిన  ప్రజావాణిలో ఆయన​ పాల్గొని మాట్లాడారు.

సికింద్రాబాద్, ఖైరతాబాద్, గోషామహల్​, ముషీరాబాద్, కార్వాన్, చాంద్రాయణ గుట్ట తదితర ప్రాంతాల్లో  వివిధ అభివృద్ధి పనులను మంత్రి పొన్నం ప్రారంభిస్తారని తెలిపారు. ఆయా ప్రాంతాలకు చెందిన సంబంధిత అధికారులు రెడీగా ఉండాలని, ఆఫీసులను క్లీన్​గా ఉంచుకోవాలని సూచించారు. కలెక్టరేట్​లోని స్నేహా సిల్వర్​ జూబ్లీ భవన్ లో  చెత్తపేరుకుపోయిన విషయాన్ని ప్రస్తావించారు. కలెక్టరేట్, ఇతర ఆఫీసుల్లో చెత్త ఉండకూడదని, కారిడార్లలో వాడకం లేని ఫర్నిచర్, ఇతర సామగ్రిని తొలగించాలని ఆదేశించారు.  ప్రజావాణికి వచ్చిన 66 అర్జీల్లో 24 హౌసింగ్​, 44 ఇతర శాఖలకు సంబంధించినవి ఉన్నాయని అధికారులు తెలిపారు. జిల్లా అడిషనల్​ కలెక్టర్ మధుసూదన్, జిల్లా రెవెన్యూ ఆఫీసర్​ వెంకటాచారి, ఆర్డీవోలు సూర్యప్రకాష్, రవికుమార్, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఎప్పటికప్పుడు పరిష్కరించండి 

ప్రజావాణికి వచ్చిన అప్లికేషన్లను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్​ అనుదీప్ ​ఆదేశించారు. వివిధ శాఖల జిల్లా అధికారులు, మండలాల తహశీల్దార్లను ఉద్దేశించి మాట్లాడుతూ తమ పరిధిలోకి వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆలస్యం చేయవద్దని స్పష్టం చేశారు. మారేడ్​పల్లి తహశీల్దార్​ ఆఫీసులో 9, హైదరాబాద్​ఆర్డీవో ఆఫీసు​లో 9, ఎస్​సీఎంలో 6  ప్రజావాణి అప్లికేషన్లు పెండింగ్​లో ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

రంగారెడ్డి కలెక్టరేట్​ : ప్రజావాణికి వచ్చే సమస్యలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను తొందరగా పరిష్కరించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌శాంక ఆదేశించారు. కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలపై వచ్చి ఫిర్యాదులను ఇవ్వగా కలెక్టర్ శ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌శాంక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అడిషనల్  కలెక్టర్ భూపాల్ రెడ్డి స్వీకరించారు. జిల్లా, మండల, మున్సిపల్ అధికారులు ప్రజావాణికి హాజరు కావాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

శాఖల వారీగా తీసుకున్న అర్జీలను రిజిస్టర్​లో నమోదు చేసి, పెండింగ్ , పరిష్కరించినవనే లెక్క తెలుస్తుందని తెలిపారు. శాఖల వారీగా సోషల్ మీడియాలో ట్విట్టర్ (ఎక్స్) అకౌంట్ ఉండాలని పేర్కొన్నారు. పంచాయతీలకు కేటాయించిన స్పెషల్ ఆఫీసర్లకు ఈనెల మంగళవారం ఓరియేంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఉంటుందన్నారు. ఈ నెల 7 నుంచి14 వరకు శానిటైజేషన్ డ్రైవ్ కొనసాగుతుందన్నారు. ప్రజావాణికి 158  ఫిర్యాదులు వచ్చాయని ఆయన తెలిపారు.