కరీంనగర్‌లో కన్ఫ్యూజన్ అవసరం లేదు.. కాంగ్రెస్ అభ్యర్థి ఆయనే: మంత్రి పొన్నం

కరీంనగర్‌లో కన్ఫ్యూజన్ అవసరం లేదు.. కాంగ్రెస్ అభ్యర్థి ఆయనే: మంత్రి పొన్నం

కరీంనగర్: కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, వెలిచాల రాజేందర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, కోడూరు సత్యనారాయణ గౌడ్ లు హాజరైయ్యారు. కాంగ్రెస్ హైకమాండ్ ఇంకా కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిని ఖరారు చేయకపోవడంతో వస్తున్న వార్తలపై మంత్రి పొన్నం స్పందించారు. కరీంనగర్ కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావే అని ఆయన అన్నారు. ఆ విషయాన్ని అధిష్టానం త్వరలో అధికారికంగా ప్రకటిస్తుందని ఆయన అన్నారు. సోమవారం మంచిరోజు కావున వెలిచాల రాజేందర్ రావుతో నామినేషన్ వేయించామని మంత్రి చెప్పుకొచ్చారు. దీన్ని మీడియా కోడిగుడ్డుపై వెంట్రుకలు పీకినట్లు చేసి చూపించవద్దని కోరారు. 


దేవుడి ఫొటోలతో తప్పా బీజేపీ మోదీ ఫొటోలతో ఎన్నికల ప్రచారం చేయట్లేదని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. మోదీ మతవాదని, రాహుల్ గాంధీ మానవతా వాది అని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముస్లింలకు ఆస్తులు పంచుతుందని మోడీ చెప్పడం బాధకరమని.. ఈ వ్యాఖ్యలను సుప్రీకోర్టు సుమోటోగా తీసుకోవాలని కోరారు. పాంచ్ న్యాయ్, కులగణన వంటివి బీజేపీకి రుచించడం లేదన్నారు. కరీంనగర్ నియోజవర్గానికి బండి సంజయ్ ఎంపీగా ఏం చేశాడని, రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తీసేసారో చెప్పాలని బండి సంజయ్ ని ప్రశ్నించారు.