బీఆర్ఎస్లో జరుగుతున్న అవమానాన్ని భరించలేకనే.. కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు: పొన్నం ప్రభాకర్

బీఆర్ఎస్లో జరుగుతున్న అవమానాన్ని భరించలేకనే.. కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు: పొన్నం ప్రభాకర్

అమరుల త్యాగాలపై ఏర్పడిన బీఆర్ఎస్ తెలంగాణ  ఉద్యమకారులను విస్మరించిందన్నారు మంత్రి పొన్నంప్రభాకర్. బీఆర్ఎస్ లో జరుగుతున్న అవమానాన్ని భరించలేకనే ఆపార్టీ నేతలు కాంగ్రెస్ లో జాయినింగ్ అవుతున్నారని చెప్పారు . ప్రజల ఆకాంక్షలతో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిందన్న పొన్నం... ప్రజాసంక్షేమానికి  కట్టుబడిఉన్నామన్నారు.

కాగా ఆనాడు చట్టసభల్లో తెలంగాణ కోసం పోరాడింది కాంగ్రెస్ ఎంపీలేనన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.. ఉద్యమకాలంలో కాంగ్రెస్ పాత్రపై చిట్ చాట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. FDI ఓటింగ్ జరుగుతున్నప్పుడు తాము ఓటెయ్యమని చెప్పామన్నారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటేనే తాము ఓటేస్తామని చెప్పినట్లు తెలిపారు. 

సుష్మాస్వరాజ్ ను తాము ఒప్పించి బిల్లుకు మద్దతు పలికేలా చేశామన్నారు. పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టే సందర్భాన్ని లైవ్ టెలికాస్ట్ ఇవ్వొద్దని ఐబీ తప్పుడు రిపోర్ట్ ఇచ్చిందని చెప్పారు. గొడవలు జరుగుతాయని తప్పుడు నివేదిక ఇవ్వడంతో లైవ్ ఇవ్వలేదని వివరించారు పొన్నం. ప్రాసెస్ ప్రకారమే బిల్లు ప్రవేశపెట్టే సమయంలో చట్ట సభలో సభ్యులు బయటికి, లోపలికి తిరగకుండా తలుపులు మూస్తారని తెలిపారు. కానీ ప్రధాని మోదీ తలుపులు వేసి బిల్లు ప్రవేశపెట్టారని చెప్పడం సరికాదన్నారు పొన్నం.