హుస్నాబాద్ లో శాతవాహన ఇంజినీరింగ్ కాలేజీ ప్రారంభం సంతోషకరం : మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్ లో శాతవాహన ఇంజినీరింగ్ కాలేజీ ప్రారంభం సంతోషకరం : మంత్రి పొన్నం ప్రభాకర్
  • స్టూడెంట్స్​కి విషెస్ చెప్పిన మంత్రి పొన్నం ప్రభాకర్​

కోహెడ(హుస్నాబాద్​)వెలుగు :హుస్నాబాద్ లో  శాతవాహన ఇంజనీరింగ్​ కాలేజీని ప్రారంభించుకోవడం సంతోషకరమని మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు.గురువారం హుస్నాబాద్ పాలిటెక్నిక్​ కాలేజీ మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్ కాలేజీని వైస్​చాన్స్​లర్​ఉమేశ్ కుమార్​తో కలిసి కలెక్టర్ హైమావతి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఫోన్ ద్వారా స్టూడెంట్స్​కి శుభాకాంక్షలు తెలిపారు. 

కాలేజీ భవన నిర్మాణానికి 35 ఎకరాల విస్తీర్ణంలో త్వరలో  సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తామని చెప్పారు. యూనివర్సిటీ రిజిస్టర్ రవికుమార్,లైబ్రరీ చైర్మన్ లింగమూర్తి,ఆర్డీవో రామ్మూర్తి, ఏఎమ్​సీ చైర్మన్ తిరుపతి రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య ఉన్నారు.