
భీమదేవరపల్లి, వెలుగు: వీరభద్ర స్వామి నక్షత్ర దీక్ష ఈ సంవత్సరం కూడా తీసుకుంటానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూర్గ్రామంలో ఎల్లమ్మ ఆలయ సమీపంలో రూ. 3 .29 కోట్లతో నిర్మించిన బ్రిడ్జిని మంత్రి ప్రారంభించారు. కొత్తకొండ గ్రామానికి చేరుకుని వీరభద్రుడిని దర్శించుకున్నారు. కమాన్ వద్ద రూ.30 లక్షలతో నిర్మించనున్న నాలుగు నంది విగ్రహాలతో కూడుకున్న త్రిశూల చౌరస్తాకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా నక్షత్ర దీక్షపరులకు అల్పహారం వడ్డించారు. ఆగస్టు 13న రెండో సారి నక్షత్ర దీక్ష తీసుకుంటానని తెలిపారు. 27 రోజుల పాటు సుమారు వందమందికి పైగా నక్షత్ర దీక్షపరులకు మంత్రి అన్నదానం అందించనున్నారు. ఆలయ ఈవో కిషన్‌రావు, అర్చకులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
కథల సంపుటిని ఆవిష్కరించిన మంత్రి పొన్నం
మంచి నేర్చుకోవాడానికి గ్రంథాలయాలు వేదికలుగా నిలుస్తాయని రాష్ర్ట మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. భీమదేవరపల్లి మండలం ములుకనూర్ గ్రామంలోని ప్రజా గ్రంథాలయ 2025 జాతీయ స్థాయి కథోత్సవ పోటీల బహుమతి ప్రదానోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గతేడాది కథల సంపుటిని ఆవిష్కరించారు.
ఇటీవలే ప్రజా గ్రంథాలయ అభివృద్ధికి రూ. 10 లక్షలు మంత్రి అందించినట్లు సీఎం ఓఎస్డీ గ్రంథాలయ అధ్యక్షుడు వేముల శ్రీనివాస్ తెలిపారు. ప్రముఖ కవి అందెశ్రీ ప్రసంగం ఆకట్టుకుంది. మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి, జీఎస్టీ కమిషనర్ శ్రీధర్, గ్రంథాలయ రాష్ర్ట మాజీ చైర్మన్ రియాజ్ పాల్గొన్నారు.