డ్రగ్స్తో జీవితాలు నాశనం చేసుకోవద్దు : మంత్రి పొన్నం ప్రభాకర్

డ్రగ్స్తో జీవితాలు నాశనం చేసుకోవద్దు :  మంత్రి పొన్నం ప్రభాకర్

కోహెడ(హుస్నాబాద్), వెలుగు: డ్రగ్స్ తో జీవితం నాశనం చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్  పేర్కొన్నారు. బుధవారం హుస్నాబాద్ లో నిర్వహించిన యాంటీ డ్రగ్స్  అవగాహన ర్యాలీలో సీపీ అనురాధతో కలిసి పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని స్టూడెంట్స్, యువతతో మంత్రి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎవరైనా మాదకద్రవ్యాలు వినియోగిస్తే 1908కి సమాచారం ఇవ్వాలన్నారు. 

మత్తుకు దూరంగా ఉండాలని నషాయుక్త్  భారత్  అభియాన్  కింద దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే, పాశ్చాత్య దేశాలను పట్టి పీడిస్తున్న మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. లైబ్రరీ చైర్మన్​ లింగమూర్తి, ఆర్డీవో రామ్మూర్తి, ఏసీపీ సదానందం ఉన్నారు.