కరీంనగర్ లో మంత్రి పొన్నం జన్మ దిన వేడుకలు

కరీంనగర్ లో మంత్రి పొన్నం జన్మ దిన వేడుకలు

కరీంనగర్ సిటీ, వెలుగు: కరీంనగర్ లో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  జన్మ దిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. యువజన కాంగ్రెస్  జిల్లా అధ్యక్షులు ముత్యం శంకర్, యువజన కరీంనగర్ అసెంబ్లీ అధ్యక్షులు పంజాల కృపసాగర్ ఆధ్వర్యంలో  తెలంగాణ చౌక్ లో  కేక్ కట్ చేశారు.  జిల్లా రీజినల్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్టు అథారిటీ మెంబెర్ పడాల రాహుల్, నాయకులు పొన్నం సత్యం, వైధుల అంజన్ కుమార్, రాచకొండ చక్రధర్ రావు, పొన్నం శ్రీనివాస్, జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు భూక్యా గజన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.