కష్టానికి కూలి ఇచ్చే టైమొచ్చింది: అజయ్ కుమార్

కష్టానికి కూలి ఇచ్చే టైమొచ్చింది:  అజయ్ కుమార్

ఖమ్మం టౌన్/కామేపల్లి/ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: రఘునాథపాలెం మండలాన్ని అభివృద్ధి చేసేందుకు తాను పడ్డ కష్టానికి ప్రజలు ఓట్ల రూపంలో కూలి ఇచ్చే సమయం ఆసన్నమైందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. రూ.7 కోట్లతో నిర్మించనున్న నాలుగు లేన్ల బీటీ రోడ్డు, సెంట్రల్ లైటింగ్, డివైడర్ నిర్మాణ పనులకు మంత్రి అజయ్ బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిధుల్లో సింహభాగం రఘునాథపాలెం మండల కోసం ఖర్చు చేసినట్లు గుర్తుచేశారు.

రోడ్ల విస్తరణతో మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. చేసిన అభివృద్ధిని చూసి వచ్చే ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరారు. అలాగే ఖమ్మం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 300 మంది అడ్వకేట్లకు కేటాయించిన హెల్త్ కార్డులను మంత్రి అజయ్​ పంపిణీ చేశారు. అంతకు ముందు ఇల్లెందు ఎమ్మెల్యే భానోత్ హరిప్రియ ఖమ్మంలోని ఇంట్లో మంత్రి అజయ్​ను కలిశారు. ఇల్లెందు టికెట్​ కేటాయించడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమెకు బొకే ఇచ్చి మంత్రి విషెస్​ తెలిపారు.