గతంలో కార్పొరేటర్లపై విష ప్రచారం చేసి తనను కొందరు దెబ్బకొట్టే ప్రయత్నం చేశారని మంత్రి పువ్వాడ అజయ్ మండిపడ్డారు. నేరుగా తనపై ఆరోపణలు చేయలేక.. కార్పొరేటర్లపై అసత్య ప్రచారాలు చేసి తనకు నష్టం కలిగించే ప్రయత్నాలు చేశారని పేర్కొన్నారు. ఖమ్మంలో ‘వాడావాడా పువ్వాడ’ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి పువ్వాడ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘ అందరూ ఒక సైడ్ అయినా ప్రజలు నన్ను గెలిపించారు. ఇప్పుడు కూడా నా ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అన్నీ డబ్బుతోనే కొనలేమనేది కొందరు గుర్తుంచుకోవాలి. ఎవరెన్ని కుట్రలు పన్నినా ప్రజలు తిప్పికొడ్తరు’’ అని పువ్వాడ కామెంట్ చేశారు.