పార్టీ ఫిరాయింపుల్లో పువ్వాడది ఘన చరిత్ర

పార్టీ ఫిరాయింపుల్లో పువ్వాడది ఘన చరిత్ర
  • మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి
  • ‘పాలకవర్గం పాపాలు.. ఖమ్మం వాసులకు శాపాలు’ 
  • పేరిట బీజేపీ చార్జిషీట్ విడుదల 

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: పార్టీలు ఫిరాయించడంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌‌‌‌ ది ఘన చరిత్ర అని బీజేపీ ఎన్నికల ఇన్‌‌‌‌  చార్జి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు.శుక్రవారం కొత్తగూడెంలో ‘పాలకవర్గం పాపాలు.. ఖమ్మం వాసులకు శాపాలు’ పేరిట బీజేపీ చార్జిషీట్ ను ఆయన రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంత్రి తీరుతో ఖమ్మం అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. కాంట్రాక్టర్లు, కార్పొరేటర్లు కుమ్మక్కై పనుల విలువ పెంచారని, క్వాలిటీని గాలికొదిలారని ఆరోపించారు. 20వ డివిజన్ నుంచి మంత్రి భార్య వసంత లక్ష్మి ఎందుకు నామినేషన్ వేశారు. ఎందుకు విత్ డ్రా చేసుకున్నారో చెప్పాలన్నారు. ఖమ్మం వాసులకు డబుల్ బెడ్రూం ఇల్లు కలగానే మిగిలిందన్నారు. గవర్నమెంట్ ల్యాండ్స్ రెగ్యులరైజేషన్ విషయంలో మంత్రికి ఒక న్యాయం, ప్రజలకు ఒక న్యాయమా? అని ప్రశ్నించారు. రైల్వే అండర్ బ్రిడ్జి ఏండ్లు గడుస్తున్నా అందుబాటులోకి రాలేదన్నారు. వర్సిటీ ఊసే లేదన్నారు. ఖమ్మం అభివృద్ధి కోసం ప్రజలు బీజేపీకే ఓటు వేయాలని కోరారు.