బూస్టర్​ డోస్​కు పర్మిషన్ ఇయ్యండి

బూస్టర్​ డోస్​కు పర్మిషన్ ఇయ్యండి

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం ఆధ్వర్యంలో బూస్టర్ డోస్​ వేసేందుకు అనుమతించాలంటూ కేంద్ర ఆరోగ్య మంత్రి మన్ సుఖ్ మాండవీయకు మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. సోమవారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల హెల్త్ మినిస్టర్లతో మన్​సుఖ్ మాండవీయ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో హరీశ్ పలు సూచనలు చేశారు. తెలంగాణలో 32 లక్షల డోసులు నిల్వ ఉన్నాయని, వాటి గడువు తేదీ దగ్గరపడుతోందని, అర్హులైన వాళ్లందరికీ ప్రికాషనరీ డోస్ ఇచ్చేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. రాష్ట్రాల్లో కొత్త వేరియెంట్ల రూపాన కరోనా వ్యాప్తి చెందుతోందని, బూస్టర్ డోస్​తో వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేయొచ్చన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రస్తుతం 60 ఏళ్లు దాటినోళ్లకు మాత్రమే బూస్టర్ డోస్ ఇవ్వాలన్న కేంద్రం.. 18 ఏళ్లు దాటినోళ్లకు కూడా ఇచ్చేందుకు గత ఏప్రిల్ 10 నుంచి ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతిచ్చింది.