
నటి నుంచి రాజకీయ నాయకురాలిగా ఎదిగిన రోజా (Roja)..అటు సినిమా రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ మంచి గుర్తింపునే తెచ్చుకున్నారు. రోజా కూతురు అన్షుమాలిక (Anshu Malika) కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రముఖ దర్శకనిర్మాతల నుంచి ఆమెకు ఆఫర్లు వస్తున్నాయని సమాచారం.
సోషల్ మీడియాలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అన్షుమాలికకు..భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారట. ఆమె సినిమాల్లోకి వస్తే స్టార్ హీరోయిన్ గా సక్సెస్ సాధించడం ఖాయమనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇదివరకే అన్షు మాలిక సినిమాల్లో నటించబోతోందని ప్రచారం జోరుగా సాగుతూ ఉంది.
గతంలో విక్రమ్ కొడుకు నటించిన సినిమాలో అన్షు మాలిక హీరోయిన్‌గా నటించనుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ ఆ సినిమాని వేరే హీరోయిన్‌తో స్టార్ట్ చేసి రిలీజ్ కూడా చేసేశారు. అన్షుమాలిక మాత్రం ప్రస్తుతం చదువు, కెరీర్ పై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టింది.
అయితే అన్షుమాలిక సినిమాల్లోకి కాకుండా రాజకీయాల్లోకి వెళ్తుందనే టాక్ సైతం వినిపిస్తోంది. ప్రస్తుతం ఆమె తల్లి రోజా రాజకీయాల్లో మంత్రి పదవిలో ఉండి బిజీగా ఉన్నారు. మరి అన్షుమాలిక సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారా? రాజీకీయ రంగ ప్రవేశం చేస్తారా? అనేది చూడాల్సి ఉంది. రోజా సెల్వమణులకు ఇద్దరు సంతానం. కూతురు అన్షు మాలిక, కొడుకు కృష్ణ కౌశిక్.